Site icon NTV Telugu

Pithapuram: పిఠాపురంపై వైసీపీ స్పెషల్‌ ఫోకస్‌..! ఆ సామాజిక వర్గాలే టార్గెట్..!

Pithapuram

Pithapuram

Pithapuram: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండడంతో.. ఇప్పుడు పిఠాపురంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పటికే ఎంపీ వంగా గీతను అభ్యర్థిగా ఖరారు చేసిన వైసీపీ ఇప్పుడు పిఠాపురంలో సామాజిక వర్గాలవారిగా ఎలక్షన్‌ వర్క్‌ షురూ చేసింది.. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓట్లపై ఫోకస్ చేసింది.. పిఠాపురంలో దాదాపు 85000 బీసీ ఓట్లు ఉన్నాయి.. అందులో మత్స్యకారులు 30000, శెట్టిబలిజ 30 వేలు, పద్మశాలి ఓట్లు 20000 ఉన్నరాయి.. నియోజవర్గంలో మొత్తం 2 లక్షల 30 వేల ఓట్లు ఉంటే.. అందులో కాపులు ఓట్లు దాదాపు 95000.. ఎస్సీ ఓట్లు 30,000 ఉన్నాయి.. దీంతో.. బీసీ, ఎస్సీ ఓట్లు టార్గెట్ గా అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పవన్ కల్యాణ్‌ను ఎదుర్కోవడానికి ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు.

Read Also: Arani Srinivasulu: నేను వైసీపీ కోవర్టును కాదు.. పవన్‌ నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను..!

అంటే.. ఆ రెండు సామాజిక వర్గాలలో మెజార్టీ ఓట్లు తమ వైపు ఉంటే గెలుపు ఈజీ అవుతుందని అంచనా వేస్తోంది వైసీపీ.. కాపులు ఓట్లలో తమ ఓటు బ్యాంకు ఎలాగో ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.. నిన్న ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మంత్రి దాడిశెట్టి రాజా.. గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది అధికార పార్టీ.. చేనేత మగ్గం పనులు చేసే పద్మశాలిలు తమ ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధి చేకూరిందని వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు.. చేనేత సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు చెక్ పెట్టే విధంగా అడుగులు ముందుకు వేస్తోంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.

Exit mobile version