NTV Telugu Site icon

Rajadhani Files: ‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలను ఆపండి..! హైకోర్టులో పిటిషన్‌

Rajadhani Files

Rajadhani Files

Rajadhani Files: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల చుట్టూ తిరుగుతోన్న సినిమాలపై రాజకీయ నేతలు కోర్టులకు ఎక్కుతున్నారు.. ఇప్పటికే వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చున్న రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాపై హైకోర్టుకు వెళ్లారు టీడీపీ నేతలు.. ఇప్పుడు.. ‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలను ఆపాలంటూ హైకోర్టు మెట్లు ఎక్కింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అయితే, ఆ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వుల జారీ వ్యవహారంపై నిర్ణయాన్ని ధర్మాసనం వాయిదా వేసింది.

Read Also: Sonia Gandhi: రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ.. నేడే నామినేషన్ దాఖలు

సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.. సినిమా విడుదల నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్.. విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. తీర్పు రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.. అయితే, రాజధాని ఫైల్స్ సినిమా విడుదల నిలిపి వేయాలని పిటిషన్ వేశారు వైసీపీ ఎమ్మెల్సీ లెళ్ల అప్పిరెడ్డి.. ఈ సినిమాలో సీఎం వైఎస్‌ జగన్, మాజీ మంత్రి కొడాలి నానిని పోలిన పాత్రలను పెట్టారి.. దానిద్వారా వాళ్లను కించ పరిచేలా చిత్రీకరణ చేశారని పిటిషనర్ వాదనగా ఉంది.. ఎన్నికల ముందు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా.. ఈ సినిమా విడుదల చేస్తున్నారు అని కోర్టులో వాదనలు వినిపించారు.. సినిమా విడుదల నిలిపివేయాలంటూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ సందర్భంగా.. డిసెంబర్ 18న సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సినీ నిర్మాత అడ్వకేట్.. స్క్రీనింగ్ కమిటీ కొన్ని అభ్యంతరాలు చెబితే వాటిని తొలగించామని.. ఆ తర్వాతే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. అయితే, ఇప్పుడు అభ్యంతరం తెలపటం సరికాదన్నారు.. మేం ఎవరిని కించ పరిచే విధంగా సినిమా తీయలేదనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. 13 సీన్స్ తొలగించాలని చెబితే తీసేసారనీ, అందుకే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చామని తెలిపారు సెన్సార్ బోర్డు అడ్వకేట్.. అన్ని వార్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని వాయిదా వేయగా.. ఈ రోజు.. ఈ సినిమాపై ఆర్డర్స్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.