NTV Telugu Site icon

Vijayasai Reddy: టీడీపీ, వైసీపీ మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే.. విజయసాయిరెడ్డి ట్వీట్

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy: ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇరు పార్టీల నేతల ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నారు. తాజాగా టీడీపీపై తీవ్రంగా వ్యాఖ్యానించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ అప్పు 169 శాతం పెరిగిందని ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏపీ అప్పులు 55 శాతానికి తగ్గాయన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాలకే ఖజానాలో సొమ్మును టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిందన్న ఆయన.. పేద ప్రజల కలల నెరవేర్చేందుకు సీఎం జగన్ పెట్టుబడి పెడుతున్నారన్నారు. టీడీపీకి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

Read Also: Pre Planned Bank Robbery: పక్కా ప్లాన్‌ ప్రకారమే.. ఐడీబీఐ బ్యాంకు వద్ద 46 లక్షల రూపాయలు చోరీ

“టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ అప్పు 169 శాతం పెరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏపి అప్పులు 55 శాతానికి తగ్గాయి. కార్పొరేట్ల ప్రయోజనాలకే ఖజానాలో సొమ్మును టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. పేద ప్రజల కలల నెరవేర్చేందుకు సీఎం జగన్ పెట్టుబడి పెడుతున్నారు. టీడీపీకి , వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే.” అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.