NTV Telugu Site icon

R Krishnaiah: బీసీల కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు..

R.krishnaiah

R.krishnaiah

R Krishnaiah: బీసీల కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని, టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని జాతీయ బీసీ అధ్యక్షుడు ,రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. విజయవాడలో బీసీ సంఘం సమావేశంలో ఆయన ప్రసంగించారు. 45 సంవత్సరాలుగా బీసీల కోసం లోక్ సభ, రాజ్యసభలలో పోరాటం ఫలితం ఈ రోజు దొరికిందని ఆయన పేర్కొన్నారు. బీసీ యువకులు అధికార, సంపదకు తావు లేకుండా బీసీల జాతి అభివృద్ధికి పనిచేయటం ఆనందంగా ఉందన్నారు.

Read Also: Tulasi Reddy: మొన్న కర్ణాటకలో.. నిన్న తెలంగాణలో.. రేపు ఏపీలో కాంగ్రెస్..

బీసీల పిల్లలు చదువుకోవటానికి సీఎం జగన్ సహాయం చేస్తున్నారని, దేశంలో కానీ, అధిక జనాభా కలిగిన ఏ రాష్ట్రాలలో లేని అత్యుత్తమ పథకాలను అందిస్తున్న నాయకుడు సీఎం జగన్‌ అంటూ ఆర్‌.కృష్ణయ్య వెల్లడించారు. బీసీల కోసం పోరాడుతున్న నాయకుడు సీఎం జగన్ అంటూ కొనియాడారు. వైస్సార్ పార్టీకి బీసీ కులాల ప్రజలు అండగా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఏపీలో ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు వచ్చే గౌరవ, మర్యాదలు భారత దేశంలోని ఏ రాష్ట్రంలో ఉండవన్నారు. బీసీలకు అధికారం, సంపద, విద్యను బీసీ, వెనుకపడిన కులాలకు అందిస్తున్న ప్రజల ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వమని ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు.