NTV Telugu Site icon

Margani Bharat: పవన్ కల్యాణ్‌కు సీఎం పోస్ట్‌పై వైసీపీ ఎంపీఆసక్తికర వ్యాఖ్యలు.. కాపు సోదరులు గమనించాలి..!

Margani Bharat

Margani Bharat

Margani Bharat: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన కలిసి ముందకు నడుస్తున్నాయి.. అయితే, సీఎం అభ్యర్థి ఎవరు అనేది వచ్చే సీట్లను భట్టి.. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని ఓవైపు.. మళ్లీ సీఎం అయ్యేది చంద్రబాబే అనే చర్చ మరోవైపు నడుస్తోంది.. అయితే, పవన్ కల్యాణ్‌.. సీఎం అభ్యర్థిపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అసలు పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థేకాదన్న ఆయన.. కాపు సోదరులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ కులగణన పూర్తిస్థాయిలో జరిగిన దాఖలు లేవు.. ప్రతి కులానికి ఎంత మంది జనాభా వున్నారు, అందరికీ ఫలాలు అందుతున్నాయా లేదా అన్న విషయం కులగణన ద్వారా తెలుసుకోవచ్చు.. అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు సమానంగా అందించవచ్చు.. కులగుణనకు సంబంధించి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం రాజమండ్రిలోనే నిర్వహించారు. బీసీ సంఘాల నేతలు నుంచి అన్ని కులాల కుల సంఘాల దగ్గరనుంచి అభిప్రాయాలు సేకరించాం.. టీడీపీ నేత యనమల ఇతర నేతలు జయహో బీసీ పేరుతో సమావేశం పెట్టడం దారుణం అన్నారు.

ఇక, పార్టీ పుట్టిన 40 ఏళ్ళలో టీడీపీ బీసీలకు ఎన్ని రాజ్యసభ సీట్లు ఇచ్చారు..? అని ప్రశ్నించారు ఎంపీ భరత్.. రాజ్యసభ సీట్లను డబ్బులు తీసుకుని అమ్ముకున్నారు.. బీసీ, ఎస్సీలను టీడీపీ చాలా చిన్న చూపు చూసింది.. వర్ల రామయ్య కు రాజ్యసభ సీటు ఇస్తామని అవహేళన చేశారు.. చంద్రబాబు బీసీ పట్ల దారుణంగా వ్యవహరించారు.. నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామన్నారు.. మత్స్యకారుల తోలు తీస్తామన్నారు అని గుర్తుచేశారు. రాజమండ్రి ఎంపీ స్థానం, రాజమండ్రి సిటీ, రూరల్ అసెంబ్లీ స్థానాలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీల కేటాయించింది.. మీరు కేటాయించగలరా..? అని సవాల్‌ చేశారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సీఎం జగన్ బీసీలకు కేటాయిస్తారు.. మీరు ఆ పని చేయగలరా..? అని చాలెంజ్‌ చేశారు.

ఎప్పుడూ కమ్మ సామాజిక వర్గానికే ఇచ్చుకుంటారు.. కేబినెట్‌లో 67 శాతం మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు.. మీరేనాడైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు ఎంపీ భరత్.. కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు అని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు ఏనాడైనా అధ్యక్ష స్థానం బీసీలకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. తండ్రి కొడుక్కి పట్టం కడతారు.. వారి సామాజిక వర్గమే ఆధిపత్యం కొనసాగిస్తుందని హెచ్చరించారు. ఐదు లక్షల కోట్లు డీబీటి, నాని డీబీటి లో సీఎం జగన్ ప్రజలకు అందించారు.. క్షేత్రస్థాయిలో టీడీపీ – జనసేన బాహాబాహికి తలపడుతున్నారు.. ఈ రెండు పార్టీల భావజాలం ఏ మాత్రం కలవదు.. చంద్రబాబు పల్లకీలు మోయడానికి మాత్రమే పవన్ కల్యాణ్‌ ఉన్నారు.. పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు.. కాపు సోదరులు ఈ విషయం గమనించాలని సూచించారు ఎంపీ మార్గాని భరత్‌.