Margani Bharat: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్‌లో కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తులపై కీలక ప్రకటన చేశారు.. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సొంత కొడుకు నారా లోకేష్, తెలుగు దేశం పార్టీ నేతలపై నమ్మకంలేకే దత్త పుత్రుడు పవన్ తో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. 2014లో ఎందుకు పొత్తు..? 2018లో ఒంటరిగా ఎందుకు ? మళ్లీ 2024లో ఎందుకు పొత్తు ..? సమాధానం చెప్పాలని నిలదీశారు ఎంపీ భరత్.. జనసైనికులకు, టీడీపీ నేతలకు.. ఇద్దరు నేతలు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
Read Also: Mumbai : డైపర్ లో కోటి రూపాయల బంగారాన్ని దాచిన భార్యాభర్తలు..
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే.. టీడీపీ అధినేత చంద్రబాబును ములాఖత్‌లో రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన ఆయన.. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని, వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని ప్రకటించారు పవన్.. ఇదే సమయంలో.. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలని తన కోరిక అని పేర్కొన్నారు.. కానీ, బీజేపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. మీకు యుద్ధమే కావాలంటే, మేమూ యుద్ధమే చేస్తామంటూ తన విధానాన్ని పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం విదితమే.