NTV Telugu Site icon

Margani Bharat: దైవాన్ని రాక్షసుడిని చేస్తారా.. చంద్రబాబు, లోకేష్ క్షమాపణ చెప్పాల్సిందే..

Margani Bharat

Margani Bharat

Margani Bharat: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆ జగన్మోహనుడిని‌ అంటే..ఈ చరాచర సృష్టిని పాలించే విష్ణుమూర్తి అంశమే జగన్మోహనుడు అని..అటువంటి దైవాన్ని ఒక రాక్షసునిగా ఏ ఉద్దేశంతో టీడీపీ నేతలు చిత్రీకరించారో యావత్ భారతీయులకు వివరణ ఇవ్వాలని డిమాండు చేస్తూ వైసీపీ శ్రేణులు రాజమండ్రిలో నిరసన చేపట్టారు. బేషరతుగా టీడీపీకి చెందిన లోకేష్ తదితర నేతలు బేషరతుగా భారతీయులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్‌లో విజయదశమి పర్వదిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘చంద్రాసుర దహనం’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ‌

Also Read: PM Modi: భారత్‌ ఆయుధాలు వాడేది ఆత్మరక్షణకే.. ఆధిపత్యం చెలాయించడం కోసం కాదు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ.. టీడీపీ నిర్వహించిన ‘జగనాసుర సంహారం’ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని.. సనాతన ధర్మానికి తిలోదకాలిచ్చే రీతిలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం బాధాకరమని‌ అన్నారు. జగన్నాధుడిగా ఆ విష్ణుమూర్తిని, శ్రీకృష్ణ భగవానుడిని హిందువులు అత్యంత భక్తి ప్రపత్తులతో కొలుస్తారన్నారు. మరి టీడీపీ విజయదశమి పర్వదినాన్న ‘జగన్నాధుడిని..రాక్షసుడిగా’ చిత్రీకరిస్తూ సంహరించే కార్యక్రమాన్ని చేపట్టడం ఒక్క వైసీపీ మాత్రమే కాదు..హిందువులు, యావత్ భారతీయులు ముక్త కంఠంతో నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు.

Also Read: Mohan Bhagwat: మణిపూర్‌లో జరుగుతున్న హింసకు బాహ్య శక్తులే కారణం

జగనాసురుడు హిందూ మైథాలజీలో ఎక్కడైనా ఉన్నాడా అని వేదపండితులను, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, హిందూ పరిషత్ సభ్యులను ఇలా నాకు తెలిసిన వారందర్నీ అడిగితే లేడని సమాధానం చెప్పారన్నారు. ప్రాస కుదిరింది కాదా అని దైవాలను రాక్షసులు చేసేస్తారా అని తీవ్ర స్వరంతో ఎంపీ భరత్ ప్రతిపక్ష టీడీపీని‌ సూటిగా ప్రశ్నించారు. దేవుళ్ళను అవహేళన చేయడం..రాజకీయాల్లోకి లాగడం..పైపెచ్చు పైత్యం ముదిరి ఏకంగా ఆ దైవం పేరుతో తయారు చేసిన ఆకృతిని మంటల్లో వేయడం పిచ్చికి, ప్రస్టేషన్ కు పరాకాష్ఠ అన్నారు. ఈ విషయంలో సెంట్రల్ జైలులో ఉండి బహిరంగ లేఖలు రాస్తున్న చంద్రబాబు స్పందించి ప్రజలకు క్షమాపణలు చెబుతూ లేఖ రాయాలని డిమాండు చేశారు. ‌గతంలో కూడా ఇదే విధమైన ఆందోళన లోకేష్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు.

Also Read: AP CM Jagan: ఈ నెల 26న సీఎం వైఎస్‌ జగన్‌ తూర్పుగోదావరి జిల్లా పర్యటన

టీడీపీ సోమవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వైట్, రెడ్ దహన‌ కార్యక్రమంలో వినియోగించారని..ఆ రెండూ జనసేన జెండా రంగులని..ఆ మంటల్లో ఎందుకు వేశారో ఇప్పటికైనా జనసేన పార్టీ వర్గీయులు ఆలోచించాలని ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఆందోళనకు బ్లాక్ కలర్ ఉపయోగిస్తారన్నారు. టీడీపీ తీరు చూస్తుంటే జనసేనకు వెన్నుపోటు పొడిచే కార్యక్రమానికి లోకేష్ శ్రీకారం చుట్టాడేమో అనిపిస్తోందని..అది వారి నైజాం కాదా అన్నారు. ఏదేమైనా జగనాసుర సంహారం పేరుతో ఆందోళనలో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ బేషరతుగా తప్పైపోయిందని అంగీకరిస్తూ క్షమాపణ చెప్పడంతో పాటు బహిరంగంగా ప్రజలంతా చూస్తూ ఉండగా గుంజీలు తీయాలని, అంత వరకూ ఏ ఒక్కరూ క్షమించరని‌ ఎంపీ భరత్ హెచ్చరించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పండితులు, బ్రాహ్మణులు, అర్చకులు దైవాలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాక్షసులుగా చిత్రీకరించి, అవమానించడం..ఆ ఆకృతులను దహనం చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. ఎవరైతే హిందూ దైవాలను హేళన చేస్తున్నారో వారికి ఆ దుర్గామాత తగిన విధంగా శిక్షిస్తుందన్నారు.