NTV Telugu Site icon

MLA Prasanna Kumar Reddy: అంతా దొంగ ఏడుపే.. కన్నీళ్లు కూడా రావట్లే..

Nallapareddy Prasanna Kumar Reddy

Nallapareddy Prasanna Kumar Reddy

Nallapareddy Prasanna Kumar Reddy: చంద్రబాబు ఆరోగ్యంపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 25 సంవత్సరాల నుంచి చంద్రబాబుకి చర్మ వ్యాధులు ఉన్నాయని.. ఇది అందరికీ తెలుసన్నారు. రోజుకి 7 షర్ట్స్, 7 ప్యాంట్స్ మారుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. జైల్లో చాలా బాగా ఉన్నాడని, అత్తగారింట్లో అల్లుడ్ని ఎలా చూసుకుంటారో అలా రాజమండ్రి జైల్లో చాలా బాగా చూసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

Also Read: Gun Firing: అహోబిలంలో నాటు తుపాకీ కాల్పుల కలకలం

భువనేశ్వరమ్మ.. మీ తండ్రి పైన చెప్పులు వేయిస్తే రాని కన్నీళ్లు చంద్రబాబు జైలుకు వెళితే వస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. అంతా దొంగ ఏడుపు ఏడుస్తున్నారు చంద్రబాబు కోసం అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కన్నీళ్లు కూడా రావటం లేదన్నారు. ప్రజలు చూడాలని, మీడియా ముందు ఏదో ఏడవాలని ఏడుస్తోందని ఆయన ఆరోపించారు. ఇవి నాటకాలు తప్ప ఇంకొకటి కాదన్నారు.

Show comments