బద్వేల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియడం సంతోషదాయకమని ప్రభుత్వ చీఫ్ విప్, వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయకుండా, పోలింగ్ శాతాన్ని తగ్గించాలనే దురుద్దేశంతో బీజేపీ చాలా అరాచకాలు చేయడానికి ప్రయత్నించింది.…