ఏపీలో పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికల కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రీ కౌంటింగ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ రాసింది. కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయి. వైసీపీ కి వచ్చిన ఓట్లు టిడిపి కి వచ్చినట్టు చూపారు. రీకౌంటింగ్ చేయాలని అభ్యర్థి కోరినా అధికారులు పట్టించు కోలేదని వైసీపీ లేఖలో పేర్కొంది. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రీ కౌంటింగ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ రాయడం హాట్ టాపిక్ అవుతోంది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయి.
Read Also: Bhumireddy Ramgopal Reddy: పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విక్టరీ
వైసీపీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్రా రెడ్డి రిటర్నింగ్ అధికారికి 17వ తేదీన ఫిర్యాదు చేశారని లేఖలో పేర్కొంది వైసీపీ. అవకతవకలు జరిగినట్టు గుర్తించిన రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ పర్యవేక్షకుడిని మార్చారని ఈసీ దృష్టికి తీసుకుని వెళ్ళింది వైసీపీ. 19వ టేబుల్ దగ్గర 9వ రౌండ్ లో వైసీపీ కి పడిన ఆరు ఓట్లను టీడీపీ ఓట్ల బండిల్ లో వేసిన విషయం బయటపడింది… లేఖలో వైసీపీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అంతకు ముందు జరిగిన కౌంటింగ్ లో కూడా ఇలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉందని ఈసీకి రాసిన లేఖలో వైసీపీ వివరించింది. ఈ నేపథ్యంలో మొత్తం ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను తిరిగి చేపట్టాలని ఈసీకి విఙప్తి చేసింది వైసీపీ. ఈసీతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా లేఖ రాసింది వైసీపీ. దీంతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Read Also: Delhi : చేంజ్ లేదు సర్.. డెలివరీ ఏజెంట్స్ పై కస్టమర్స్ దాడి