NTV Telugu Site icon

YV Subba Reddy: ఎన్నికల్లో పోటీ.. మార్పులు, చేర్పులపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు..

Yv

Yv

YV Subba Reddy: ఎన్నికలకు అంతా సిద్ధం అవుతున్నారు.. నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను అని కొందరైతే.. అధిష్టానం ఏది చెబితే అదే చేస్తాను అని మరికొందరు నేతలు ప్రకటిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలుగా సీఎం జగన్ కు చెప్పాను అన్నారు. పోటీ చేసేవాడ్ని అయితే 2019లోనే పోటీ చేసుండేవాడ్ని.. కంటిన్యూ అయ్యేవాడ్ని.. ప్రత్యక్ష రాజకీయాలు గ్యాప్ రావటంతో పార్టీ పనులు చూస్తున్నా.. పక్కన ఉన్నా కాబట్టి పార్లమెంటుకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం జగన్ కు చెప్పాను అన్నారు. అయితే, పోటీ విషయంలో అంతిమంగా సీఎం జగన్ నిర్ణయానికి శిరసావహిస్తానని స్పష్టం చేశారు.

Read Also: Shatamanam Bhavati Next Page : శతమానం భవతి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన దిల్ రాజు..

సీనియర్ నేతలు పార్టీని వీడటానికి వారి వ్యక్తిగత కారణాలు వారికున్నాయన్నారు వైవీ.. సీట్ల మార్పు విషయంలో సీఎం జగన్ స్పష్టంగా ఉన్నారన్న ఆయన.. గెలుపునకు దూరంగా ఉన్న అభ్యర్థులకు సీట్లు ఉండవని ముందు నుంచి సీఎం వైఎస్‌ జగన్ చెబుతున్నారని గుర్తు చేశారు. సీట్లు ఇవ్వని వారు కొత్తవాళ్లతో అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది.. కానీ, అన్నీ సర్దుబాటు అవుతాయన్నారు. అల్టిమేట్ గా ట్రాక్ రికార్డును బట్టే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఫైనల్ అవుతాయన్నారు. కొత్త మార్పులు, చేర్పులకు సంభందించి పండుగ తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది.. సీటు రానివారికి అసంతృప్తులు ఉంటాయి.. వారికి నచ్చచెప్పి బుజ్జగింపులు చేస్తున్నాం అన్నారు.

Read Also: Mayawati Birthday: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం..

దేశంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం వైఎస్‌ జగనే అన్నారు సుబ్బారెడ్డి.. పార్టీ ఆఫీసుల్లో కూర్చుని బీసీలకు ఏం చేయలేదనే విమర్శలు చేయటం సరికాదని హితవుపలికారు. ఇక, వైఎస్‌ షర్మిల కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి రావటం వల్ల మాకొచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. ఆమెను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసేది ఏమీలేదన్నారు. మా వల్ల మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే మాకు ఓటెయ్యండని సీఎం వైఎస్‌ జగన్ చెబుతున్నారు.. అంత ధైర్యంగా చెప్పే సీఎం దేశంలో ఎవరూ లేరన్నారు. మరోవైపు.. ఈ మధ్య వైఎస్‌ మరణం వ్యాఖ్యలపై ఈ మధ్య జరుగుతోన్న వివాదంపై స్పందిస్తూ.. వైఎస్ మరణంపై గతం నుంచి అనేక అనుమానాలు ఉన్నాయన్నారు వైసీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి.

Show comments