Site icon NTV Telugu

YCP Rajya Sabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థులు

Ycp Rajya Sabha Candidates

Ycp Rajya Sabha Candidates

YCP Rajya Sabha Candidates: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. రాజ్యసభ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది.. మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్‌ రెడ్డి పేర్లు ఫైనల్‌ చేశారు.. అయితే, ఇవాళ అధికారికంగా వైసీపీ అధిష్టానం ప్రకటించనుంది.. ఇక, సీఎం వైఎస్‌ జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ముగ్గురు రాజ్యసభ వైసీపీ అభ్యర్థులు.. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో వైఎస్‌ జగన్‌ను కలిసిన గొల్ల బాబు రావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి.. తమ పేర్లను రాజ్యసభ ఎన్నికలకు ఖరారు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: BRS: స్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.. కేసీఆర్ కు ఛాంబర్ కేటాయింపుపై చర్చ

ఇక, ఈ నెల 12వ తేదీన నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలనే ఆలోచనలో వైసీపీ అభ్యర్థులు ఉన్నారట.. మరోవైపు, రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పత్రాలపై ప్రతిపాదిత సంతకాలు చేయించిన వైసీపీఎల్పీ సిబ్బంది. మూడు స్థానాల కోసం రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. కావాల్సిన సంఖ్య కంటే వైసీపీకి ఎక్కువ ఎమ్మెల్యేల బలం ఉంది.. ఇదే సమయంలో.. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో ముఖ్య నేతలు పడిపోయారు.. 132 మంది ఎమ్మెల్యేల బలంతో మూడు రాజ్యసభ స్థానాలు తేలిగ్గా కైవసం చేసుకునే అవకాశం ఉంది.. అయితే, గత ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. అసంతృప్తలపై వైసీపీ అధిష్టానం ఫోకస్‌ పెట్టిందట.. ఇప్పటికే మార్పులు, చేర్పులతో కొంత మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. మరికొందరు పార్టీకి రాజీనామా చేశారు.. ఈ నేపథ్యంలో. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version