Site icon NTV Telugu

Alla Ramakrishna Reddy: నేను నారా లోకేష్‌పై గెలిచాను.. అందుకే ఈ తప్పుడు కేసులు..!

Alla Ramakrishna Reddy

Alla Ramakrishna Reddy

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశంలో సీఐడీ విచారణకి ఆయన హాజరయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ విచారణ ముగిసింది.. రెండు గంటలపాటు సీఐడీ అధికారులు ఆర్కేను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తనకు నోటీసు ఇచ్చారని తెలిపారు. నోటీసు ఇవ్వడంతో తాను విచారణకు హాజరయ్యానని చెప్పారు. తాను ఆ రోజు లేనని… దాడి జరిగిన అంశం నాకు తెలియదని అని విచారణలో చెప్పానన్నారు.

READ MORE: Perni Nani: అందుకే వంశీని 115 రోజులుగా జైల్లో ఉంచారు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

“నాకు నోటీస్ ఇవ్వడమే దారుణం. 2021లో జరిగిన అంశంపై పోలీసులు విచారణ చేశారు. అదే దర్యాప్తులో కొత్తగా నోటీసులు ఇవ్వడం దారుణం. నారా లోకేష్ పై నేను గెలిచాను కాబట్టే తప్పుడు కేసులు పెడుతున్నట్లు అనిపిస్తుంది. రాజకీయ కక్ష్యతోనే నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక కేసుల్లో నన్ను ఇరికించాలని చూశారు ఎక్కడ ఏది కనిపించలేదు. నేను కేసులో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరు నా పేరుని చెప్పి కూడా ఉండరు. సీసీటీవీ ఫుటేజ్ లో ఎక్కడ నేను లేను. ఛార్జ్ షీట్ వేసే ముందు కావాలని నా పేరుని ఈ కేసులో చేర్చారు.” అని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

READ MORE: Operation Sindoor: భారత్‌కి వైమానిక నష్టాలు ఉన్నాయి.. పాక్‌లోకి వెళ్లి దాడులు చేశాం: సీడీఎస్..

Exit mobile version