NTV Telugu Site icon

YSRCP: పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై వైసీపీ కసరత్తు

Ysrcp

Ysrcp

YSRCP: ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీలో ఇంఛార్జుల మార్పు కొనసాగుతూనే ఉంది. టికెట్టు విషయంలో చర్చించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి పార్టీ నాయకులు క్యూ కడుతున్నారు. తాజాగా పార్టీ పెద్దల నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. నియోజకవర్గ ఇంఛార్జుల మార్పులపై సీఎం వైఎస్ జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. మార్పులు చేసే నియోజకవర్గాల నేతలను పిలిపించి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్‌, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి రాజా, ప్రసన్న కుమార్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు వచ్చారు. ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, సూళ్ళూరు పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు కూడా వచ్చారు.

Read Also: Harsha Kumar: షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిక కుట్రే.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌తో మంత్రి జోగి రమేష్‌ భేటీ అయ్యారు. సీఎంను కలిసి తన సీటు విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. పెడన నియోజకవర్గంపై ఇంకా స్పష్టత రాకపోవడం గమనార్హం. త్వరలోనే ఈ సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంకు నరసారావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చారు. నరసారావు పేట లోక్ సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నియామక అంశంపై చర్చించారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సీఎం అపాయింట్ మెంట్ కుదరింది. ఈ క్రమంలో సీఎం జగన్‌తో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. నరసారావు పేట పార్లమెంట్ ఇన్‌ఛార్జి అభ్యర్థి ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి ఎంపికపై పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.