AP Elections 2024: ఆయనదే గెలుపు రూ.20 లక్షలు పందెం.. లేదు మా నాయకుడే.. రూ.50 లక్షలు పందెం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: పోలింగ్ ముగిసింది.. మరో మూడు రోజులు ఆగితే.. నాలుగో రోజు ఫలితాలు రాబోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు అధికారంలోకి వస్తారు? అనేదానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి.. ఇదే సమయంలో.. బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? అని మొదలుకొని.. కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లో గెలుపు ఓటములతో పాటు.. మెజార్టీలపై బెట్టింగ్ కాస్తున్నారు.. అయితే, ఇప్పుడు ఈ జాబితాలోకి నేతలు సైతం చేరుతున్నారు.. కర్నూలు జిల్లా కోసిగి జడ్పీటీసీ మంగమ్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.. మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నాలుగోసారి గెలిచి మంత్రి పదవి చేపడుతాడని.. వైఎస్ జగన్ రెండోసారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తాడని నేను రూ.20 లక్షలు పందెం కాస్తాను.. ఎవరికైన ధైర్యం ఉంటే పందెంకు రావాలని.. రేపు ఒకటో తారీఖున కోసిగి ఎల్లమ్మ గుడి దగ్గర ఉంటానని అక్కడకు రావాలని బహిరంగంగా సవాల్ విసిరారు మంగమ్మ..
Read Also: Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.. (వీడియో)
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
అయితే, కోసిగి జడ్పీటీసీ మంగమ్మకు ధీటుగా మంత్రాలయం మండలం వగరూరుకు చెందిన టీడీపీ నాయకుడు మడ్రి చిన్నన్న.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ప్రతిసవాల్ చేశారు.. రూ. 50 లక్షలు విలువ చేసే రెండు ఎకరాల పొలం పందెం కాస్తానని ప్రతి సవాల్ వదిలారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నిబంధనల విరుద్ధంగా పందెం కాయడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఇరు పార్టీల బహిరంగంగా నాయకులు సోషల్ మీడియా ద్వారా పందెం కాయడం ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఇరువర్గాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని సిటిజన్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!