ఇటీవల గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణలో భాగంగా కొన్ని ఇళ్ల కట్టడాలను అధికారులు తొలగించిన వ్యవహారం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. జనసేన సభకు స్థలాల ఇచ్చిన వారినే లక్ష్యంగా చేసుకొని వారికి చెందిన కట్టడాలను కూల్చివేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. కట్టడాలు కూల్చిన మరుసటి రోజు ఇప్పటం గ్రామంలో పర్యటించిన పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటంలో ఇళ్లు కూలిస్తే.. ఇడుపులపాయలో హైవే వేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.
Also Read :Koti Deepotsavam 2022: 8వ రోజు కోటి దీపోత్సవం కార్యక్రమాలు ఇవే..
అయితే.. ఈ కట్టడాలనే కాకుండా.. రోడ్డు విస్తరణ భాగంగా మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, నెహ్రూ విగ్రహాలను సైతం అధికారులు తొలగించి.. పక్కనే ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని మాత్రం తొలగించకపోవడం గమనార్హం. దీంతో పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా.. సోషల్ మీడియా వేదిక కూడా తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఇప్పటం గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించింది. క్రేన్ సాయంతో విగ్రహం తరలించారు. గాంధీ, నెహ్రూ మహానుభావుల విగ్రహాలతో పాటు వైఎస్సార్ విగ్రహాన్ని కూడా తొలగించారు.