NTV Telugu Site icon

Times Now Survey: లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీదే హవా.. మొత్తం స్థానాలకూ!

Ysrcp

Ysrcp

Times Now Survey: ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయభేరిని మోగించడం ఖాయమని తాజాగా టైమ్స్‌ నౌ సర్వేలో తేలింది. వైసీపీ ఈ సారి 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయనుందని సర్వే స్పష్టం చేసింది. టైమ్స్‌ నౌ నిర్వహించిన ఈ సర్వేలో వైస్సార్‌సీపీ విజయం తథ్యమని వెల్లడించింది. ఏకపక్షంగా ఆ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపింది. ఓట్ల శాతంలో స్వల్ప తేడా ఉంటుందని.. కానీ ఫలితంలో ఏ మాత్రం తేడా లేదని టైమ్స్ నౌ సర్వే తేల్చి చెప్పింది. టీడీపీ ఒక ఎంపీ స్థానం మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఆ సర్వే చెప్పింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా వైసీపీకి ప్రజాదరణ పెరగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్

ఇదిలా ఉండగా.. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ 9 నుంచి 11 సీట్లు గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించగా.. బీజేపీ 2 నుంచి 3 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్‌ 3 నుంచి 4 సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇతరులు కూడా ఓ స్థానంలో గెలుపొందే అవకాశం ఉందని టైమ్స్‌ నౌ సర్వే వెల్లడించింది. గత నెలలో నిర్వహించిన సర్వే ఫలితాలను టైమ్స్‌ నౌ విడుదల చేసింది.