YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారా..?
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారా?
- సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన YSR కాంగ్రెస్ పార్టీ .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారా? అనేది పెద్ద ప్రశ్న అంటూ సోషల్ మీడియా వేదికగా YSR కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకున్న సందర్భాలు చాలా తక్కువని, రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని తెలిపింది. 100% ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉందని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఏర్పాటు చేయగా, చంద్రబాబు పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని కేంద్రాన్ని కోరడం.. చంద్రబాబు చేసిన ఈ నిర్ణయం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినట్లేనని పేర్కొన్నారు.
Also Read: Aadhar card: భారతదేశంలో ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డులు నిషేధం!.. కారణం ఏంటంటే?
Also Read
- Shreyas Iyer: "తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే".. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
- Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
- Tilak Varma: ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. అందుకే విజయం సాధించాం: తిలక్ వర్మ
- Hyderabad: భాగ్యనగరంలో గన్ కల్చర్ కలకలం.. పంజాగుట్ట బార్లో రివాల్వర్‌తో బెదిరింపులు..
2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి పోలవరం బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించారు. ఆ వెంటనే ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ ద్వారా పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడం ఒకటే గమనించాలని, కమిషన్ల కోసం ఈ విధంగా ప్రాజెక్టును ఉపయోగించుకున్నారని తెలిపారు. 2005 నుంచి 2019 వరకు జరిగిన పనులు కేవలం 24.85 శాతం మాత్రమేనని, అయితే 2019 నుంచి 2024 మధ్య మా ప్రభుత్వం హయాంలో 24.94 శాతం పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. ఇది ఖచ్చితమైన గణాంకాల ద్వారా నిరూపితమైన విషయం. కరోనా మహమ్మారి రెండేళ్లపాటు ప్రభావం చూపినా, జగన్ ప్రభుత్వం రూ. 8,629 కోట్లు వ్యయం చేసి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిందని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చిత్తశుద్ధి లేనిది ఎవరికి @ncbn? ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో
ఎప్పుడైనా పోలవరం గురించి మనసుపెట్టి ఆలోచించారా? పోలవరం ఆలస్యానికి కారణమే మీరని మీకు కూడా తెలుసు. అయినా తప్పును ఒప్పుకోరు.రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో పోలవరాన్ని జాతీయ… https://t.co/lqSNrpTsEM pic.twitter.com/2SmbZjasmi
— YSR Congress Party (@YSRCParty) February 5, 2025
Also Read: Caste Census : గ్రామాలలో కుల గణన సంబరాలు చేయాలి.. పీసీపీ ఆదేశం
2014–19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారని అందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 2021 నుంచి 2024 వరకు జగన్ ఈ ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లకే పరిమితం చేస్తామని స్పష్టం చేశారు. ఇది కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా లోక్‌సభలో రాతపూర్వకంగా తెలియజేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడిందన్న విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన విషప్రచారాలు ప్రజలకు అంతు చిక్కడం లేదని, ప్రజలు వాస్తవాలను స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!