NTV Telugu Site icon

YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారా..?

Cm

Cm

YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారా? అనేది పెద్ద ప్రశ్న అంటూ సోషల్ మీడియా వేదికగా YSR కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకున్న సందర్భాలు చాలా తక్కువని, రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని తెలిపింది. 100% ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉందని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఏర్పాటు చేయగా, చంద్రబాబు పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని కేంద్రాన్ని కోరడం.. చంద్రబాబు చేసిన ఈ నిర్ణయం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినట్లేనని పేర్కొన్నారు.

Also Read: Aadhar card: భారతదేశంలో ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డులు నిషేధం!.. కారణం ఏంటంటే?

2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి పోలవరం బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించారు. ఆ వెంటనే ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్ ద్వారా పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడం ఒకటే గమనించాలని, కమిషన్ల కోసం ఈ విధంగా ప్రాజెక్టును ఉపయోగించుకున్నారని తెలిపారు. 2005 నుంచి 2019 వరకు జరిగిన పనులు కేవలం 24.85 శాతం మాత్రమేనని, అయితే 2019 నుంచి 2024 మధ్య మా ప్రభుత్వం హయాంలో 24.94 శాతం పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. ఇది ఖచ్చితమైన గణాంకాల ద్వారా నిరూపితమైన విషయం. కరోనా మహమ్మారి రెండేళ్లపాటు ప్రభావం చూపినా, జగన్ ప్రభుత్వం రూ. 8,629 కోట్లు వ్యయం చేసి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిందని పేర్కొన్నారు.

Also Read: Caste Census : గ్రామాలలో కుల గణన సంబరాలు చేయాలి.. పీసీపీ ఆదేశం

2014–19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారని అందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 2021 నుంచి 2024 వరకు జగన్ ఈ ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లకే పరిమితం చేస్తామని స్పష్టం చేశారు. ఇది కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ కూడా లోక్‌సభలో రాతపూర్వకంగా తెలియజేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడిందన్న విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన విషప్రచారాలు ప్రజలకు అంతు చిక్కడం లేదని, ప్రజలు వాస్తవాలను స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.