YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక ఎన్నికల పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే గెలుస్తామనే నమ్మకం లేకనే సీఎం చంద్రబాబు నాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘం కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, పోలీసుల తూటాలకు కూడా భయపడకుండా నిలబడిన వైసీపీ కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. పార్టీ కార్యకర్తలు చూపిస్తున్న పోరాట పటిమను ఆయన ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటేనే మూడేళ్లు గడిచిపోయినట్లు అనిపిస్తోందని జగన్ వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు నాటుతున్న విషపు మొక్కలు భవిష్యత్తులో వృక్షాలుగా మారుతాయని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడిన ప్రతి అధికారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారం తమ చేతుల్లో ఉందని, ఏమైనా చేసుకోవచ్చని భావించవద్దని అన్నారు. తమకు కూడా సమయం వస్తుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే, ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ పార్టీ కార్యకర్తలు తాను చెప్పినా వినే పరిస్థితి ఉండకపోవచ్చన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు తమ వైఖరిని మార్చుకుని.. న్యాయం, ధర్మం వైపు నిలవాలని సూచించారు. రాజకీయ కక్షలు, దాడులకు దూరంగా ఉండాలని మాజీ సీఎం పిలుపునిచ్చారు.
Also Read
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
- YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
- CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
రాష్ట్ర ఎన్నికల సంఘం చంద్రబాబు ప్రభుత్వానికి వత్తాసు పలకకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం, పోలీసులు తటస్థంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఉండేలా ఎన్నికల ప్రక్రియ సాగాలని అన్నారు. ప్రస్తుత ఎన్నికలను కేవలం ప్రారంభంగా అభివర్ణించిన జగన్.. 2029 సార్వత్రిక ఎన్నికలను టీడీపీకి ఫినిషింగ్ లైన్‌గా పేర్కొన్నారు. ప్రస్తుతం తమ పార్టీ కార్యకర్తల్లో పెరుగుతున్న ఆగ్రహం, పోరాట స్ఫూర్తి భవిష్యత్తులో రాజకీయ పరిణామాలకు కారణమవుతాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని సంకేతాలిచ్చారు. 2024 ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని తాము గతంలోనే ఆరోపించామని గుర్తుచేశారు. ఈ అంశానికి సంబంధించి ఆధారాలతో కేసులు కూడా దాఖలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న తమ ఆరోపణలపై న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
- Tags
- ap
- cm chandrababu
- ycp
- ys jagan
తాజావార్తలు
-
YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!