Site icon NTV Telugu

YS Jagan Visits Rashid Family: రషీద్‌ కుటుంబానికి జగన్ పరామర్శ

Jagan

Jagan

YS Jagan Visits Rashid Family: పల్నాడు జిల్లా వినుకొండలో రెండ్రోజుల క్రితం ప్రత్యర్థి దాడిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని రషీద్‌ నివాసానికి వెళ్లిన జగన్‌.. బాధిత కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. మాజీ సీఎం జగన్‌ను చూడగానే రషీద్‌ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. మా కొడుకును బలి తీసుకున్నారని రషీద్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరులా విలపించారు. వారిని జగన్‌ ఓదార్చారు. రషీద్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఘటన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నిందితులకు శిక్ష పడేలా పోరాడతామని జగన్‌ బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు. ఏపీలో జరుగుతున్న దాడులపై మోడీని కలుస్తామని.. ఏపీ పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్ జగన్‌ అన్నారు.  ఈ పరామర్శలో జగన్‌ వెంట పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు.

 

 

Read Also: Gandharva mahal: వందేళ్ల ‘‘గంధర్వ మహల్’’.. ఆచంటలో అద్భుత కట్టడం..

 

Exit mobile version