YS Jagan on EVMs: ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. బ్యాలెట్ విధానమే ముద్దు..!
- ఈవీఎంల వాడకంపై వైఎస్ జగన్ కీలక ట్వీట్
- న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు.. నిజంగా జరగాలి
- ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలి
- ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో.. దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు
- ఈవీఎంలను ఉపయోగించడం లేదు. ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan on EVMs: సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి ఈవీఎంలపై రకరకాల ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈవీఎంల వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈవీఎంల విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ సీఎం.. ”న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు.. నిజంగా జరగాలి. అలాగే ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో.. దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు. ఈవీఎంలను ఉపయోగించడం లేదు. ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలి.. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి. ” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్..
Read Also: Priyanka Gandhi : వయనాడ్ నుంచి ప్రియాంక రెడీ.. పోటీపై సీపీఐ నేత అన్నీ రాజా ఏమన్నారంటే?
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
కాగా, గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగరవేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చతికిలపడిపోయింది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించగా.. వైనాట్ 175 అంటూ ఎన్నికల్లో వెళ్లిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయిన విషయం విదితమే. అయితే, సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో బీజేపీకి సీట్లు దక్కినా.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగా.. ఈవీఎంలపై విపక్షాల నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.. ఈ తరుణంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
Just as justice should not only be served, but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly.
In electoral practices across the world in almost every advanced democracy, paper ballots are used, not EVMs.…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 18, 2024
తాజావార్తలు
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!