YS Jagan: డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి లా అండ్ ఆర్డర్ లేదని అనటం ఆశ్చర్యంగా ఉందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. దళిత మంత్రి మీద విమర్శలు చేసి ఊరుకున్నారని.. లా అండ్ ఆర్డర్ గురించి ప్రశ్నించాల్సింది చంద్రబాబుని అంటూ ఆయన పేర్కొన్నారు.చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం పవన్‌కు లేదన్నారు. దళిత మహిళ కాబట్టి పడుతుంది అని పవన్ ఆమెపై విమర్శలు చేశారన్నారు. సొంత నియోజకవర్గంలో అత్యాచారం చేస్తే పవన్ ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. సినిమా డైలాగ్‌లు కొట్టమంటే మాత్రం పవన్ తోలు తీస్తా అని డైలాగ్‌లు కొడతారంటూ ఎద్దేవా చేశారు.
డీజీపీ చట్టం వైపు, న్యాయం వైపు నిలబడాలన్నారు. డీజీపీకి మా ప్రభుత్వ హయంలో మంచి పదవి ఇచ్చామన్నారు. పదవి వ్యామోహంతో డీజీపీ ఇలా తయారయ్యాడని విమర్శించారు. డీజీపీ అధికార పార్టీ కార్యకర్తల మాదిరి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పోలీసులు సరిగా పనిచేస్తే అత్యాచారాలు, హత్యలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు.సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే రీతిలో వ్యవహరిస్తున్న పోలీసులు ప్రభుత్వం ఎప్పుడు ఇదే ఉండదు అని తెలుసుకోవాలన్నారు. పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తామన హెచ్చరించారు.
Read Also: YS Jagan: అన్ని వ్యవస్థలను నీరుగార్చి నాశనం చేస్తున్నారు.. ఏపీ ప్రభుత్వంపై జగన్ ఫైర్
జమిలి ఎన్నికపై మరోసారి జగన్ వ్యాఖ్యలు
జమిలి గిమిలి అంటున్నారని.. అధికారం కూడా త్వరగా కోల్పోవచ్చని జగన్ జోస్యం చెప్పారు. లేకపోయినా నాలుగేళ్ల సమయం మాత్రమే ఉంటుందన్నారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రిటైర్ అయ్యాక కూడా పోలీసుల సంగతి కూడా చూస్తామన్నారు.సప్త సముద్రాల అవతల ఉన్నా పోలీసులను ఇక్కడకు పిలిపిస్తామన్నారు. చేసిన తప్పులను బయటకు తీసి చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. రెడ్ బుక్ పెట్టడం వాళ్లకు మాత్రమే తెలుసా.. రెడ్ బుక్ పెట్టడం పెద్ద విషయం కాదన్నారు. బాధితులు అందరూ రెడ్ బుక్ పెట్టుకుంటారన్నారు. వాళ్లు అందరూ వచ్చి నాకు వినతులు ఇస్తే చూస్తూ ఊరుకోనన్నారు.
సరస్వతి భూముల్లో పవన్ పర్యటనపై జగన్ రియాక్షన్
వెయ్యి ఎకరాల్లో 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని.. ఆ ప్రభుత్వ భూమి కూడా తీసుకోలేదని ఎమ్మార్వో చెప్పిందని జగన్ వెల్లడించారు. అలాంటి చోటుకి పవన్ వెళ్లారన్నారు. పక్కనే భవ్య సిమెంట్స్ వాళ్లు ఎకరం 50 నుంచి 90 వేలకు కొన్నారని.. మేం ఎకరం 3 లక్షలకు తక్కువకు కొనలేదని జగన్ చెప్పారు. గ్రామ సభల్లో ఎకరం 2.70 లక్షలు అడిగితే తాను 3 లక్షలు ఇవ్వాలని చెప్పానన్నారు. తాడిపత్రి దివాకర్ రెడ్డిపై అనేక ఆరోపణలు గతంలో వచ్చాయన్నారు. తాను తీసుకున్నది అంతా ప్రైవేట్ భూములు మాత్రమేనని జగన్ వెల్లడించారు. సిమెంట్ ఫ్యాక్టరీ లకు నీరు ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత కాదా అంటూ ప్రశ్నించారు. పవన్ అసలు ఎలా మంత్రి అయ్యారో అర్థం కాదని ఎద్దేవా చేశారు. పవన్‌కు ఏం బుద్ధి ఉందో ఏం జ్ఞానం ఉందో ఏంటో అంటూ విమర్శించారు. గతంలో చంద్రబాబు నన్ను ఇబ్బంది పెడితే కోర్టుకు వెళ్ళగా అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. పరిశ్రమలు పెట్టే జిందాల్ కడపలో పరిశ్రమ పెట్టడం కోసం పనులు మొదలు పెట్టారన్నారు. జిందాల్‌ను ఇబ్బంది పెట్టడం కోసం జిత్వానీతో తప్పుడు ఫిర్యాదులు చేయించి ఇబ్బంది పెట్టారని అన్నారు.ఒరిస్సాలో ఆర్సెల్లర్ మిట్టల్ పరిశ్రమ పెడితే ఇక్కడ కూడా పెడుతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. సరస్వతి పవర్ కట్టక పోవటానికి కారణం టీడీపీ కాంగ్రెస్ వాళ్ళే కదా అంటూ విమర్శించారు. వీళ్ళ కేసులు వల్లే సరస్వతి భూములు ఈడీ అటాచ్ చేసిందని జగన్ అన్నారు.