YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీ సర్వేకు సంబంధించిన క్రెడిట్‌ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. 80 ఏళ్ల వయసున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సమగ్ర భూ సర్వే చేశారా?అంటూ ప్రశ్నించారు.
భూముల రీ సర్వే కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించామని.. అత్యాధునిక టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు 40 వేల మందికి శిక్షణ ఇచ్చామని జగన్ తెలిపారు. కోట్ల సంఖ్యలో సర్వే రాళ్లను గ్రామాలకు తరలించి కేవలం 5 cm తేడా కూడా లేకుండా కొలతలు వేశామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా భూవివాదాల పరిష్కారం కోసం 1,358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఏడుగురు సజీవదహనం
భూసర్వే కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని, 2020 డిసెంబర్ 9న సర్వే ఆఫ్ ఇండియాతో అధికారిక ఒప్పందం చేసుకున్నామని జగన్ గుర్తుచేశారు. భూ సర్వే ప్రక్రియలో 3,640 GNSS పరికరాలు వినియోగించామని తెలిపారు. భూముల రీ సర్వేను నీతి ఆయోగ్ ప్రశంసించిందని.. కేరళ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల అధికారులు ఈ సర్వే విధానాన్ని అధ్యయనం చేసి మెచ్చుకున్నారని వెల్లడించారు. అప్పటి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ కూడా ఈ ప్రక్రియను ప్రశంసించారని తెలిపారు. అసోం రాష్ట్రం సైతం తమ ప్రభుత్వ సహకారం కోరిందన్నారు.
ఎన్నికల సమయంలో IVRS కాల్స్ ద్వారా రైతులను భయపెట్టారని, మీ భూములు మీకు దక్కవని దుష్ప్రచారం చేశారని జగన్ ఆరోపించారు. భూముల రీ సర్వేపై చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ చర్యల వల్లే కేంద్రం నుంచి రూ. 400 కోట్ల రాయితీ వచ్చిందని, భూముల రీ సర్వేకు రూ. 6 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. ఈ రీ సర్వేకు ఏపీకి కేంద్రం నుంచి “ప్లాటినమ్ గ్రేడ్” దక్కిందని పేర్కొన్నారు.
YS Jagan: భూసర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం..!
వైసీపీ హయాంలో ఇచ్చిన భూ పాసు పుస్తకాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని జగన్ అన్నారు. యూనిక్ నెంబర్, క్యూఆర్ కోడ్ అన్నీ అదే ఉంచి, కేవలం పాస్ పుస్తకాల రంగు మాత్రమే మార్చి ఇస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు కొత్తగా చేసింది ఏమీ లేదని.. రంగులు మార్చడం తప్ప అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇస్తున్న పాస్ పుస్తకాల్లో అనేక తప్పులు దొర్లుతున్నాయని, వైసీపీ హయాంలో పాతిన కొలత రాళ్లపై ఉన్న పేర్లను చెరిపేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు.
