YS Jagan: ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్

  • ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిటిషన్
  • గతంలో తనకు ఉన్న సెక్యూరిటీ కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్
Ys Jagan

Ys Jagan

YS Jagan: ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. గతంలో తనకు ఉన్న సెక్యూరిటీ కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ప్రభుత్వం ఏక పక్షంగా తనకు ఉన్న సెక్యూరిటీ తొలగించినట్టు, తనకు ఉన్న ప్రాణ హాని అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం వ్యవహరించినట్లు పిటిషన్‌లో జగన్‌ పేర్కొన్నారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌ మరో రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.