NTV Telugu Site icon

YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది..

Ys Jagan On Tirumala Laddu

Ys Jagan On Tirumala Laddu

YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మండిపడ్డారు. దేవుడు దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని.. దేశంలో ఎక్కడా లేని పరిస్థితులు ఏపీలో చూస్తున్నామన్నారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారని.. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇస్తున్నారని జగన్ వెల్లడించారు.

ఓ వైపు తనను, మరోవైపు వైసీపీ శ్రేణులను తిరుమలకు వెళ్లనివ్వడం లేదన్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్లను తిరుమల తెప్పిస్తున్నారన్నారు. టాపిక్ డైవర్ట్‌ చేయడం కోసం ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుమలలో వేలాది మంది పోలీసులను మోహరించారన్నారు. అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. తిరుమల విశిష్టతను, ప్రసాదం పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారని విమర్శించారు. జరగని విషయాన్ని జరిగినట్టుగా కల్తీ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రసాదం కల్తీ అయ్యిందని.. ఆ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని వైఎస్ జగన్ చెప్పారు. ఓ ముఖ్యమంత్రే సాక్షాత్తూ తిరుమలను దగ్గరుండి అపవిత్రం చేస్తున్నారన్నారు. లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు తప్పుడు ప్రచారం చేశారన్నారు. నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకోసారి రొటీన్‌గా జరిగే కార్యక్రమమని తెలిపారు. 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికే లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. లడ్డూ తయారీ టెండర్లలో ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికే టీటీడీ పర్మిషన్ ఇస్తుందన్నారు. తప్పు చేయాలని అనుకున్నా కూడా టీటీడీ బోర్డులో తప్పు చేయలేమన్నారు. ఏ నిర్ణయమైనా బోర్డు సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకుంటారని జగన్ చెప్పారు.

Read Also: Minister Ramanaidu: సాగు నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం.. విడుదలైన జీవో..

ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని తిరుమలలో మూడుసార్లు శాంపిళ్లను పరీక్షిస్తారని తెలిపారు. క్వాలిటీలో ఏదైనా తేడా వస్తే ట్యాంకర్లను రిజెక్ట్ చేస్తారన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇలా 15 సార్లు రిజెక్ట్ చేసి ట్యాంకర్లను వెనక్కి పంపించారన్నారు. మా ప్రభుత్వ హయాంలో 18 సార్లు నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేశామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక జూన్‌ 12 నుంచి నెయ్యి సరఫరా మొదలైందన్నారు. జులై 6 తర్వాత వచ్చిన నాలుగు ట్యాంకర్లు టెస్టుల్లో ఫెయిల్ అయ్యాయన్నారు. ఆ తర్వాత ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించారన్నారు. రిజెక్ట్ అయిన నెయ్యి ట్యాంకర్లను మైసూర్‌లోని CFTRIకి పంపిస్తారన్నారు. కానీ మొదటిసారి ఈ ట్యాంకర్లను గుజరాత్‌లోని NDDBకి పంపించారన్నారు. అక్కడ NDDB రిపోర్ట్ వచ్చింది.. సరఫరా చేస్తున్న వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారన్నారు. నెయ్యి వాడలేదని క్లియర్‌గా తెలుస్తున్నా చంద్రబాబు నెయ్యిని వాడినట్టు ఉద్దేశపూర్వకంగా అన్నారన్నారు.

Read Also: AP CM Chandrababu: తిరుమల సన్నిధిలో ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలి..

జులై 23నే ఈవో.. రిజెక్ట్ అయిన ట్యాంకర్లలోని నెయ్యి వాడలేదని క్లియర్‌కట్‌గా చెప్పారని.. సెప్టెంబర్‌ 18న చంద్రబాబు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్‌ను కలిపారని ఆరోపించారన్నారు. సెప్టెంబర్‌ 19న టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను విడుదల చేశారన్నారు. సెప్టెంబర్‌ 20న ఈవో మీడియాతో మాట్లాడుతూ రిజెక్ట్ అయిన ట్యాంకర్లలోని నెయ్యిని వాడలేదని ధృవీకరించారన్నారు. సెప్టెంబర్‌ 22న ఈవో తాను సంతకం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారన్నారు. ఈవో ఇచ్చిన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సెప్టెంబర్ 19న టీడీపీ వాళ్లు రిలీజ్‌ చేస్తారన్నారు. కాన్ఫిడెన్షియల్లి నెయ్యిని NDDB ల్యాబ్ గుజరాత్‌లో టెస్టులను చేశామని, ఆ ట్యాంకర్లు వెనక్కి పంపిషోకాజ్ నోటీసులు ఇచ్చామని ప్రభుత్వానికి ఈవో రిపోర్ట్ ఇచ్చారని.. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ టీడీపీ ఆఫీసులో ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. సెప్టెంబర్ 22న చంద్రబాబు మళ్ళీ ట్యాంకర్లు వాడారని అబద్ధాలు చెబుతున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు స్వామి వారి ప్రసాదం, తిరుమల విశిష్ఠతను అబద్దాలతో తగ్గించారని మండిపడ్డారు. ఇదంతా అపవిత్రత కాదా అంటూ ప్రశ్నించారు.