సీఎం చంద్రబాబు ఏడాదిన్నరగా కావాలనే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టారని సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. తిరుమల లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రకరకాలుగా ప్రచారం చేశారని, చివరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారని అసహనం వ్యక్తం చేశారు. దేవుడంటే ఏమాత్రం భయం, భక్తి లేకుండా రాజకీయాలు చేశారని ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజని మీద దాడులు చేశారని.. వారు చేసిన తప్పేంటి? అని ప్రశ్నించారు. ఇదే ప్రభుత్వం ఎప్పుడూ ఉండదని, వచ్చే మూడేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు.
వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుంది. భయానక వాతావరణంలో పాలన జరుగుతుంది. అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చూస్తే జంజిల్ రాజ్యం ఏ స్తాయిలో ఉందో తెలుస్తుంది. అంబటి, జోగి, కాకాణిలు చేసిన తప్పేంటి?. ప్రశ్నిస్తున్నారని మా వాళ్ళపై దాడులు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు కుట్ర పూరితంగా జంతువుల కొవ్వు అని తప్పుడు ప్రచారం చేసాడు. ఆవు, పంది, చేప కొవ్వు అంటూ ఉద్దేశ్య పూర్వకాలంగా దేవుడి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారికి దేవుడంటే భయం భక్తి లేవు. దుర్మార్గంగా తప్పుడు ప్రచారం చేశారు. కేంద్ర ల్యాబ్లు ఎలాంటి జంతువుల కొవ్వు లేదని రిపోర్ట్ ఇచ్చాయి. సీబీఐ అదే విషయాన్ని సుప్రీం కోర్టుకి రిపోర్ట్ ఇచ్చింది. తప్పు చేసి ఉంటే వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పేర్లు సీబీఐ ఎందుకు చేర్చలేదు. సీబీఐ వాళ్లకు క్లీన్ చిట్ ఇచ్చింది. అసలు సీబీఐ విచారణ కావాలని సుప్రీమ్ కోర్టును కోరిందే వైవీ సుబ్బారెడ్డి. చంద్రబాబు, లోకేష్, పవన్లు చెంపలేసుకుని క్షమాపణ కోరాలి. క్షమాపణ చెప్పకుండా మళ్లీ అదే దుర్మార్గపు అపార్థాలను ప్రచారం చేస్తున్నారు’ అని ఫైర్ అయ్యారు.
Also Read: Mega158 Cast: చిరంజీవి 158కు ‘మెగా’ క్యాస్టింగ్.. ఫుల్ లిస్ట్ ఇదేనా?
‘సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు వేయిస్తున్నారు. కుల మతాలను రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెట్టడం రాజ్యాంగ విరుద్దం కాదా. ఇలానే మేము సూపర్ సిక్స్ అమలు చెయ్యలేదని ఫ్లెక్సీలు వేస్తే ఒప్పుకుంటారా. ఫ్లెక్సీలు పెట్టి ప్రజల్లో బావోగ్వేదాలు రెచ్చగొట్టేలా చెయ్యడం తప్పు కాదా?. ఇలాంటి దుర్మార్గాలను ప్రశ్నిస్తే మా వాళ్ళపై దాడులు చేయిస్తారా?. సీఎం చంద్రబాబుకి మంచి బుద్ది ప్రసాదించాలని దేవుణ్ణి కోరి గుడి నుండి వస్తుంటే దాడులు చేసారు. అంబటి రాంబాబుని పోలీసుల సమక్షంలో కర్రలు పట్టుకుని కారుపై దాడికి పాల్పడ్డారు. కారులో ఉన్న రాంబాబుని దారుణమైన భూతులు తిడుతూ దాడి చేసారు. ఒక్కడే ఉండటం వల్ల అంబటి ఆగ్రహానికి గురయ్యారు. అలాంటి సమయంలో నోట్లో నుండి రెండు తిట్లు వచ్చాయి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు వచ్చిన తిట్లే తప్ప ఉద్దేశ్య పూర్వకంగా తిట్టలేదు. సంస్కారం ఉన్న వ్యక్తి కనుక ఆ మాటలు రావడంపై బాధపడి.. వివరణ ఇచ్చాడు. తిట్లు వచ్చినందుకు చింతిస్తూ వెనక్కి తీసుకున్నాడు. అలాంటి సంస్కారం ఉన్న అంబటిని చేతనైతే పొగడాలి.. కానీ దుర్మార్గంగా హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. ఏకంగా 8 గంటల పాటు హత్యకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలో దాడి చేశారు. ఇంట్లో మహిళలను ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఫర్నీచర్ పగలగొట్టారు. కార్లు ధ్వంసం చేసి.. ఆఫీస్ కి నిప్పు పెట్టారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఇలాంటి దాడులు జరిగేవా?. డీజీపీ ఆఫీస్ కూతవేటు దూరంలో ఉంది.. పక్కనే బెటాలియన్ ఉంది.. కంట్రోల్ చెయ్యలేరా?. అధికారులకు ఫోన్లు చేసినా ఒక్కరు ఎత్తలేదు.. పక్కా ప్లాన్ ప్రకారం హత్యాయత్నం చేసారు’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
