YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అమలువుతున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, జైలుకు పంపిన తీరు రాష్ట్రంలో బాధితులే నిందితులుగా మారుతున్న దారుణ పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ, చివరకు ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ధ్వంసం చేసి అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్రల పాలన సాగుతోందని జగన్ విమర్శించారు. రాత్రి 2:45 గంటల సమయంలో వందల మంది పోలీసులు దొంగల్లా, బందిపోటు ముఠాలా వచ్చి ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటి డోర్లు, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఆయనను అపహరించుకుపోయారని ఆరోపించారు. పగటిపూట నోటీసులు ఇస్తే రాని ఉగ్రవాదా ఆయన అని ప్రశ్నించారు. గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై మూడు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఆయన కుమారుడు, తమ్ముడు, తమ్ముడి కుమారుడిని కూడా ఈ కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు.
Also Read
- Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్‌స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
- YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
- CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
- CM Chandrababu: నా గ్రేట్ విజన్‌కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
ఆగష్టు 1న సంగాల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త గిరిపై దాడి జరుగుతుంటే, ఆయన రక్షణ కోసం ఎమ్మెల్యే విరూపాక్షి మానవత్వంతో అక్కడికి వెళ్లడమే నేరమన్నట్లు పోలీసులు వ్యవహరించారని జగన్ తెలిపారు. స్థానిక ఎస్సై, సీఐలకు ఫోన్ చేసినా పోలీసులు కాపాడకపోవడంతోనే ఎమ్మెల్యే స్వయంగా వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత నెమకల్లు వద్ద ఎమ్మెల్యేపై దాడి చేసి, ఆయన తమ్ముడి చెయ్యి విరగ్గొట్టారని వెల్లడించారు.
ఈ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలు తానే చించి, ఆ నెపం ఎమ్మెల్యేపై నెట్టి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయని, సదరు మహిళతో తప్పుడు మాటలు చెప్పిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని, ఈ అక్రమాలపై ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాలని జగన్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
-
Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
-
Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
-
Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై కేంద్రానికి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!