YouTube: మరో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసిన యూట్యూబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ యూజర్లకు మరో సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. కొద్ది రోజల క్రితం యాంబియంట్ మోడ్, డార్క్ థీమ్ లాంటి అదిరిపోయే అప్డేట్స్ ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు వీడియో సెట్టింగ్స్‌లో స్టెబుల్ వాల్యూమ్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను యూట్యూబ్ పరిచయం చేస్తోంది. దీంతో సడన్ చేంజ్‌లు లేదా వీడియో మొత్తం హెచ్చుతగ్గులు లేకుండా ఒకే విధంగా ఉండేలా సెట్ చేసుకునేలా అప్డేట్ చేసింది. ఇక, అధికారికంగా అనౌన్స్ చేయకముందే ఈ స్టెబుల్ వాల్యూమ్ సెట్టింగ్ వెలుగులోకి వచ్చింది.
Read Also: YSRCP: పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై సీఎం సీరియస్.. ఇది తగునా..!
Also Read
- TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
- Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
- SL Vs PAK: శ్రీలంకపై పాకిస్థాన్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు ఇలా..
- Rajasthan: రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం.. సీఎం, మంత్రుల కంచుకోటల్లో బీజేపీకి షాక్..
అయితే, సాధారణంగా యూట్యూబ్‌లోని ఒక్కో వీడియో ఒక్కో శబ్దంతో ప్లే అవుతుంది. ఒక వీడియో చాలా పెద్ద సౌండ్‌తో వస్తే.. మరికొన్ని తక్కువ సౌండ్‌తో ప్లే అవుతాయి. దీనివల్ల సౌండ్ పెంచుతూ, తగ్గిస్తూ ఉండాల్సి పరిస్తితి నెలకొంటుంది. అప్‌కమింగ్ స్టెబుల్ వాల్యూమ్ ఫీచర్‌తో అన్ని వీడియోలలో వాల్యూమ్ ఒకే విధంగా ఉండేలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. తద్వారా మనం సెట్ చేసుకున్న ఒకే సౌండ్‌తో అన్ని వీడియోలు ప్లే అవుతాయి. స్మార్ట్ టీవీలు, సౌండ్ సిస్టమ్స్, రోకు, ఇతర మీడియా ప్రొవైడర్లు ఇలాంటి ఫీచర్లను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాయి. యూట్యూబ్ కూడా ఈ సౌండ్ లెవలింగ్ ఫీచర్‌ను అతి త్వరలోనే లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీడియో సెట్టింగ్స్‌లో యాంబియంట్ మోడ్ కింద ఈ ఫీచర్ కనిపించబోతుందని ఓ యూట్యూబర్ తెలిపారు.
Read Also: Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ ఊడుతున్న ఉద్యోగాలు..ఉద్యోగుల్లో టెన్షన్..
స్టెబుల్ వాల్యూమ్ ఫీచర్ గురించి వస్తున్న ఊహాగానాలు నిజమైనవేనని యూట్యూబ్ కన్ఫర్మ్ చేసింది. అన్ని వీడియోల్లో వాల్యూమ్ ఆప్టిమైజ్ చేయడానికి ఈ ఫీచర్ ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్ల ద్వారా ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్లు యూట్యూబ్ కు చెందిన ఓ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చి ఉంటే, దానిని యూట్యూబ్ యాప్‌లోని వీడియో సెట్టింగ్స్ పేజీలో యాక్సెస్ చేసుకోవచ్చు అని తెలిపాడు. ఈ నెల ప్రారంభంలో యూట్యూబ్ రెండు కొత్త ఫీచర్లను తీసుకోచ్చింది. అందులో లాక్ స్క్రీన్ ఒకటి. మొబైల్ యాప్ హోమ్ ఫీడ్‌లో ఏఐ జనరేటెడ్ క్విజ్లు అందించే మరో ఫీచర్‌ను కూడా యూట్యూబ్ ట్రయల్ చేస్తోంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Illandu Missing Person : ఇల్లందులో 45 రోజులుగా కనిపించని వ్యక్తి.. వీడని మిస్టరీ
-
SL Vs PAK: శ్రీలంకపై పాకిస్థాన్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు ఇలా..
-
Rajasthan: రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం.. సీఎం, మంత్రుల కంచుకోటల్లో బీజేపీకి షాక్..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!