జూన్ 19న కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘మహా రోజ్‌గర్ మేళా’ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో 100 కి పైగా కంపెనీలు యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇప్పటివరకు 20 వేలకు పైగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ కార్యక్రమం జూన్ 19 న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరుగుతుంది. తాజాగా యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, యూత్ కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త యాజ్ఞవాల్క్య శ్రీకాంత్ జిచ్కర్, ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్షయ్ లక్రా, ఢిల్లీ యూత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఖుష్బూ శర్మ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో జాబ్ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.
READ MORE: KTR Sends Legal Notice: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ కల్పించలేదని యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ విమర్శించారు. రాహుల్ గాంధీ నిరుద్యోగ సమస్యను ప్రముఖంగా లేవనెత్తారన్నారు. జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా యువజన కాంగ్రెస్ ఉద్యోగ మేళా నిర్వహించాలని నిర్ణయించిందని అన్నారు.100 కి పైగా కంపెనీలను ఆహ్వానించామని, ఇవి యువతను ఇంటర్వ్యూ చేసి వారికి ఉద్యోగాలు కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా నిరుద్యోగులుగా ఉన్న వేలాది మంది ఢిల్లీ యువత ఈ ఉద్యోగ మేళా ద్వారా ప్రయోజనం పొందుతారన్నారు. ఇప్పటికే 20 వేలకు పైగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడించారు. జూన్ 19న జాబ్ మేళాతో పాటు, ఇతర రాష్ట్రాల్లో కూడా రక్తదాన శిబిరాలు, కుల గణనపై సెమినార్లు నిర్వహిస్తున్నట్లు చిబ్ చెప్పారు.
READ MORE: Israel Iran War: అమెరికా నుంచి 14,000 కిలోల “బంకర్ బస్టర్” బాంబు కోరుతున్న ఇజ్రాయిల్..
Tags:
