Site icon NTV Telugu

Transgender : మహబూబాబాద్ జిల్లాలో ఆదర్శ వివాహం

Marriage Fraud

Marriage Fraud

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన ఓ ఆదర్శ వివాహము అందర్నీ ఆకర్షిస్తోంది.. లింగభేదాన్ని పక్కన పెట్టి సంప్రదాయం బద్దంగా చేసుకున్న ఈ వివాహానికి కుటుంబ సభ్యుల ఆమోదించడంతో ఆనందోత్సాహాల మధ్య వివాహం ఘనంగా జరిగిందిజ అసలు ఈ సాంప్రదాయక వివాహము ఎవరు చేసుకున్నారు ఎక్కడ జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో వింత వివాహం ఆదర్శంగా జరిగింది. ఓ యువకుడు ట్రాన్స్‌డెంజర్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.

Also Read : Periods Pains : పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గించాలంటే.. వీటిని తప్పక తీసుకోవాలి..!

వీరి ప్రేమను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో​ వివాహం ఘనంగా జరిగింది. గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ బానోత్ రాధిక(28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరూ(30) ప్రేమించుకున్నారు. గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే, బానోత్ రాధికకు రైలులో వీరూ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ అధ్యక్షులు మాట్లాడుతూ సమాజంలో తమను గుర్తించాలన్నారు. ఇలాంటి ఆదర్శ వివాహాలు మరిన్ని జరగాలని కోరుకున్నారు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు కూడా కల్యాణ లక్ష్మి అందజేయాలని కోరారు. వివాహ తంతులో ట్రాన్స్‌జెండర్ శోభ, రాధిక, దుర్గ, నందు, రవళి పాల్గొన్నారు.

Also Read : Sonu Sood : ఆ ఇద్దరి స్టార్ హీరోల పై ఆసక్తికర కామెంట్స్ చేసిన సోనూసూద్..!!

Exit mobile version