NTV Telugu Site icon

Heart Attack: యువతకే హార్ట్ ఎటాక్ ఎక్కువగా వచ్చే ఛాన్స్..

Heart Attct

Heart Attct

వరల్డ్ వైడ్ గా ఎక్కువ మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణమని అనేక సర్వేలు తెలుపుతున్నాయి. అలాగే ఐదేండ్లుగా భారత్ లో కూడా హార్ట్ ఎటాక్ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. పేలవమైన జీవనశైలి, అలవాట్ల మార్పులతో ప్రపంచవ్యాప్తంగా కార్డియాక్ అరెస్ట్, గుండె సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు గుండెపోటు కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేది.. కానీ ఇప్పుడు 30-40 ఏండ్ల మధ్య వయసున్న ప్రతి ఒక్కరకి గుండెపోటుతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. దీనికి ఎన్నో కారణాలున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్, డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయం వంటివి ఉన్నాయి.

Also Read: Keerthi Sagar: సినీ పరిశ్రమలో విషాదం.. రచయిత అనుమానాస్పద మృతి

భారత్ లోని మొత్తం మరణాలలో హృదయ సంబంధ వ్యాధులు దాదాపు 28శాతం ఉన్నాయని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది. సరైన పోషణ, జీవనశైలి మార్పులతో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీనికోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని నిపుణులు చెబుతున్నారు. మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి మనం తీసుకునే ఆహారాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. అలాగే గుండెను ఫిట్ గా ఉంచుతాయి. అందుకే గుండె పోటు రిస్క్ ను తగ్గించుకోవడానికి హెల్తీ ఫుడ్ ను తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Also Read: Asaduddin Owaisi: బీజేపీ పాలనలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.. వీడియోలను షేర్‌ చేసిన ఒవైసీ

పోషకాహారానికి, గుండె ఆరోగ్యం మధ్య బలమైన సంబంధం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ట్రాన్స్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, ఉప్పు, శుద్ధి చేసిన చక్కెరలు ఎక్కువగా ఉన్న ఫుడ్స్ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తృణధాన్యాల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి.

Also Read: Gun Firing: పాతబస్తీలో గన్ ఫైరింగ్.. సివిల్ వివాదంలో ఇరువర్గాల మధ్య గొడవ

కొన్ని ఆహారాల్లో, సప్లిమెంట్లలో ఉండే కోఎంజైమ్ క్యూ 10, రెస్వెరాట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే గుండెను రక్షిస్తాయని నిపుణులు కనుగొన్నారు. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం, న్యూట్రాస్యూటికల్స్ ను మన ఆహారంలో చేర్చడం వల్ల గుండె హెల్తీగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన, చక్కెర ఎక్కువగా ఉన్నఆహారాలను ఎక్కువగా తినకూడదు. అలాగే బరువును కంట్రోల్ లో ఉంచడానికి క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి. వ్యాయామం గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.