Snake Byte: ప్లాస్టిక్ బ్యాగ్ లో పామును తీసుకొచ్చి ఆస్పత్రిలో హంగామా చేసిన యువకుడు..

  • సోషల్ మీడియాలో వైరల్.
  • ఆసుపత్రికి విషపూరితమైన పాముని చంపి తీసుకెళ్లిన యువకుడు .
  • ఆసుపత్రిలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Viral Snake

Viral Snake

Snake Byte: విషపూరిత జీవుల్లో పాములు ఒకటి. ఇందులో కొన్ని విషపూరితమైనవి కాగా.. మరికొన్ని విషం లేనివి. అయినప్పటికీ., పాము కనిపిస్తే చాలు.. అవి ఎలాంటి రకమైనవి అయినా సరే, వాటికి వీలైనింత దూరంగా వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ చూస్తారు. సోషల్ మీడియాలో కూడా పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటాము. ఇందులో భాగంగానే తాజాగా ఓ చనిపోయిన పాముకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియో సంబంధించిన వివరాలలోకి వెళితే..

Ukraine Russian War : యుద్ధ బీభత్సాన్ని రష్యన్లకూ పరిచయం చేస్తున్న ఉక్రెయిన్‌

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని చందౌలీ పట్టణంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చందౌలీ నగరంలో ఉన్న కమలపాటి జిల్లా ఉమ్మడి ఆస్పత్రిలో కలకలం రేగింది. ఆస్పత్రికి ప్లాస్టిక్‌ కవర్లో చనిపోయిన పాముతో ఓ యువకుడు వచ్చాడు. పాము కనిపించిన వెంటనే అక్కడ ఉన్న ఆసుపతి బృందం, ఇంకా అక్కడి రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్టాఫ్ నర్సులు, ఇతరులు అక్కడినుండి కొందరు పారిపోయారు. అనంతరం పామును బయటకు విసిరి చికిత్స అందించారు వైద్య నిపుణులు. నిజానికి, బలువా పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌదర్ గ్రామానికి చెందిన ఫర్హాన్ ఖాన్ అనే వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు. ఆగ్రహించిన యువకుడు పామును కూడా చంపి ప్లాస్టిక్‌ కవర్లో ప్యాక్ చేసి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లి పాము కాటు గురించి వైద్యుడికి తెలియజేసారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.