AP News: మాయమాటలు చెప్పి.. పదో తరగతి విద్యార్థినిపై యువకుడు అత్యాచారం, చివరకు..!
- రాజమండ్రిలో దారుణం
- పదో తరగతి విద్యార్థినిపై యువకుడు అత్యాచారం
- నిందితుడిపై ఫోక్సో, అత్యాచారం సెక్షన్లు కింద కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. మాయమాటలతో బయటకు తీసుకువెళ్లి పదో తరగతి హాస్టల్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. నిందితుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన అజయ్‌గా పోలీసులు గుర్తించారు. రాజమండ్రి టూ టౌన్ సీఐ శివ గణేష్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…
రాజమండ్రిలోని ఓ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని సోమవారం సాయంత్రం అన్నయ్య వచ్చాడని, సబ్బులు తెచ్చుకోవాలని హాస్టల్ వార్డెన్‌కు చెప్పి బయటకు వెళ్ళింది. పరిచయం ఉన్న అజయ్ అనే యువకుడు మాయమాటలు చెప్పి గోదావరి గట్టుకు బైక్‌పై తీసుకువెళ్లాడు. అజయ్ వెంట బైక్‌పై మరో యువకుడు వచ్చాడు. ఆ బాలిక పట్ల అసభ్య ప్రవర్తిస్తూ, మాయమాటలతో అజయ్ రైల్వే స్టేషన్ రోడ్లో ఓ లాడ్జికు తీసుకువెళ్లాడు. రూమ్‌లో బాలికపై అజయ్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని బైక్‌పై తీసుకువచ్చి దేవీచౌక్‌లో దింపివేశాడు.
Also Read
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
Also Read: CM Chandrababu: లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం!
విద్యార్థిని హాస్టల్ లోనికి వెళ్లిపోయింది. అమ్మాయి కంగారు పడటం సహా మెడ, పెదాల పైన గాట్లు ఉండేసరికి అనుమానం వచ్చి వార్డెన్ ప్రశ్నించింది. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక జరిగిన విషయం చెప్పడంతో కంగారుపడి వెంటనే వారి తల్లిదండ్రులకు హాస్టల్ వార్డెన్ సమాచారం ఇచ్చింది. ముందుగా బాలికని ఆసుపత్రికి తీసుకువెళ్లి.. ఆ తర్వాత వార్డెన్‌తో సహా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి బంధువులు పిర్యాదు చేశారు. అనుమానిత వ్యక్తి సెల్ నెంబర్ ఆధారంగా.. రావులపాలెంకు చెందిన అజయ్ గా పోలీసులు భావిస్తున్నారు. రాజమండ్రి పోలీసులు నిందితుడిపై ఫోక్సో, అత్యాచారం సెక్షన్లు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి ఏకాంతమే ఇష్టం! సంఖ్యాశాస్త్రం ఏమి చెబుతోందంటే ?
-
Mercedes-Benz AMG E 53: మెర్సిడెస్ బెంజ్ AMG E 53 విడుదల.. 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!