Viral Video: జంతు హింస నిషేదం.. అది ఎంతటి వారు చేసినా శిక్షార్హులవుతారు. అది పెద్ద జంతువుల విషయంలో ఉంటుందేమో కానీ ఇంట్లో మనకు నష్టం కలిగించే ఎలుకల విషయంలో కూడా ఉంటుందా.. అసలు ఎలుకను చంపితే నేరమా..? వాటిని చంపితే కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారా.. జైలు శిక్ష విధిస్తారా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక ఎలుకను చంపినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా చనిపోయిన ఎలుకకు పోస్టు మార్టం కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఈ హత్య కు సంబంధించిన ఓ వార్త బదౌన్‌లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: IPL Auction : మారనున్న ఐపీఎల్ వేలం షెడ్యూల్.. ఫ్రాంచైజీల కళ్లన్నీ ఆ క్రికెటర్లపైనే
అసలు విషయం ఏంటంటే.. రోడ్డు పక్కన కల్వర్టుపై మనోజ్ కుమార్ అనే వ్యక్తి కూర్చున్నాడు. తన సమీపంలో వెళ్తున్న ఓ ఎలుకను పట్టుకుని దాని తోకకు రాయికట్టి కాలువలో పడేశాడు. అదే టైంలో వికేంద్ర శర్మ అనే వ్యక్తి అక్కడి నుంచి వెళ్తున్నాడు. ఎలుకకు రాయి కడుతున్న వ్యక్తిని అలా చేయకుండా ఆపాడు. అయితే ఆ వ్యక్తి వికేంద్ర శర్మ చెప్పిన మాటలను వినలేదు.. అతడి కళ్ల ముందే ఎలుకను కాలువలోకి విసిరాడు. వెంటనే వికేంద్ర శర్మ ఆ ఎలుకను కాలువ నుంచి బయటకు తీశాడు. అప్పటికే ఆ ఎలుక చనిపోయింది. దీంతో వికేంద్ర శర్మకి కోపం వచ్చి.. నిందితుడు మనోజ్ కుమార్ ను ఎలుకను ఎందుకు చంపావని ప్రశ్నించాడు. తాను ఇలానే చంపుతానని నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో కోపం తెచ్చుకున్న వికేంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎలుకకు పోస్టుమార్టం నిర్వహించాలని, నిందితుడిపై జంతు హింస చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. దీనికి సంబంధించిన వీడియోను బదౌన్ పోలీసులు ట్వీట్ చేశారు. ‘చనిపోయిన ఎలుకను పోస్ట్ మార్టం కోసం.. బదౌన్‌లోని వెటర్నరీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కు పంపినట్లు పేర్కొన్నారు.
Read Also:Viral News: కోతికి జీవిత ఖైదు.. ఐదేళ్ల శిక్ష పూర్తి.. అసలు అది చేసిన తప్పేంటంటే
चूहे की हत्या के आरोप में युवक गिरफ्तार, पत्थर में बांधकर नाले में फेंका था | Unseen India pic.twitter.com/akBOCIBR8R
— UnSeen India (@USIndia_) November 25, 2022