Love Couple Suicide: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని గౌరీ శంకర్ ప్యాలెస్ హోమ్‌స్టేలో ప్రేమజంట మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడు, యువతి ప్రేమికులను తేల్చారు. మృతులను డియోరియా నివాసి ఆయుష్ కుమార్, బారాబంకిలోని దరియాబాద్‌కి చెందిన అరోమాగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుష్ మొదట తన ప్రియురాలు అరోమాను గన్‌తో కాల్చాడు. అనంతరం అతను తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం హోమ్‌స్టే సిబ్బంది టీ ఇవ్వడానికి ఆ రూంకి వెళ్లారు. చాలా సేపు తలుపు తట్టినా గేటు తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ బృందం సమక్షంలో తలుపులు బద్దలుగొట్టారు. రక్తంతో తడిసిన యువకుడు, యువతి మృతదేహాలు కనిపించాయి. గదిలో అక్రమంగా వాడుతున్న గన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి తలలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేన్నామని సిటీ ఎస్పీ చక్రపాణి త్రిపాఠి వెల్లడించారు.
READ MORE: YS Jagan: సరోజాదేవి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు!
గౌరీశంకర్ ప్యాలెస్ యజమాని హేమంత్ జైస్వాల్ మాట్లాడుతూ.. “ఉదయం 10:00 గంటల ప్రాంతంలో ఒక అబ్బాయి, అమ్మాయి భార్యాభర్తలమని చెప్పి హోటల్‌కు వచ్చారు. వారు తమ గుర్తింపు కార్డులను కూడా ఇచ్చారు. గదిలోకి వెళ్లిన తరువాత బయటకు రాలేదు. సాయంత్రం టీ తాగుతారా? అని అడగమని సిబ్బందిని చెప్పాను. గది తలుపు లోపలి నుంచి లాక్ చేశారు. చాలా సేపు తట్టిన తర్వాత కూడా తలుపు తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాం.”” అని పేర్కొన్నారు.
