Return Gifts at Wedding: సాధారణంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, పుట్టిన రోజు, వస్ర్తాలంకరణ వంటి వేడుకలను ఎంతో వేడకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. వేడుకలకు ఎంతో ఖర్చు చేస్తారు. వచ్చిన వాళ్లు గుర్తుపెట్టుకునేలా వేడుకలను చేస్తారు. వేడుకలను చేసి ఊరుకుంటారా? అంటే వేడుకలకు వచ్చిన బంధుమిత్రులకు .. తమ గుర్తుగా రిటర్న్ గిఫ్ట్ లను ఇస్తుంటారు. గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ. రిటర్న్ గిఫ్టులుగా వస్త్రమో, వస్తువో ఇవ్వడం సర్వ సాధారణం. రిటర్న్ గిఫ్ట్ లను ఇవ్వడం.. వారు నిర్వహించే వేడుకను బట్టి ఉంటుంది. పెళ్లి అయితే ఒక రకమైనది.. పుట్టిన రోజు అయితే ఒకరకం.. గృహప్రవేశానికి వస్తే మరొక రకం బహుమానాలను ఇస్తుంటారు. అయితే ఇక్కడ పెళ్లికి వచ్చిన వారికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ లు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎక్కడ.. ఏమీ జరిగిందంటే..
Read Also: Odisha Train Accident: బాధితుల ఆర్తనాదాలు.. రక్తదానం చేసేందుకు ముందుకొస్తున్న యువత..
పుదుచ్చేరిలో సాధారణంగా శుభకార్యం జరిగినప్పుడు ఆ కార్యానికి విచ్చేసిన బంధుమిత్రులకు కొబ్బరికాయ, అరటిపండు, తమలపాకులు, కుంకుమతో కూడిన తాంబూలాలు ఇస్తారు. అలాగే ఈ పెళ్లివారు కూడా ఓ బ్యాగులో తాంబూలాలు పెట్టి ఇచ్చారు. అయితే ఆ బ్యాగు తెరిచి చూసుకున్న బంధువుల్లో కొందరు మురిసిపోతే, మరికొందరు షాకయ్యారు. ఎందుకంటే ఆ బ్యాగుల్లో కొబ్బరికాయ, అరటిపండు, తమలపాకులు, కుంకుమతోపాటుగా క్వాటర్ లిక్కర్ బాటిల్ కూడా ఉంది. ఈ ఘటన గురించి తెలిసి కొందరు నవ్వుకుంటుండగా మరికొందరు మాత్రం సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఘటనపై పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. పెళ్లిలో రిటర్న్ గిఫ్టులుగా లిక్కర్ బాటిళ్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వారు చేస్తున్నారు.