NTV Telugu Site icon

T20 World Cup: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ చూసే అవకాశం

Disney

Disney

టీ20 వరల్డ్ కప్కు సరిగ్గా నెల సమయం కూడా లేదు. ఐపీఎల్ అయిపోయిన వెంటనే.. ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అమెరికా, వెస్టిండీస్ ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్.. జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ ను ఏంచక్కా ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు.. మరో పండగ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మెగా టోర్నీని చూసేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Rajasthan: హైవేపై ట్రక్కు యూటర్న్.. దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి

జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే టీ 20 వరల్డ్ కప్ ను డిస్నీప్లస్ హాట్ స్టార్ ఉచితంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపింది. ఇండియాలోని యూజర్లు మొబైల్ వెర్షన్ లో ఎలాంటి సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ లేకుండా వరల్డ్ కప్ ను వీక్షించొచ్చని డిస్నీ బుధవారం (మే 7) పేర్కొంది. ఎక్కువ మందికి క్రికెట్‌‌‌‌‌‌‌‌ వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. గతంలో భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను సైతం ఉచితంగా ప్రసారం చేసింది. అప్పుడు డిస్నీకి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

Aishwarya Arjun: అర్జున్ ఇంట పెళ్లి భాజాలు.. పెళ్లి అప్పుడే?

తాజాగా.. ఐపీఎల్ మ్యాచ్లను జియో సినిమా ఉచితంగా ప్రసారం చేస్తుంది. అత్యధిక వ్యూయర్ షిప్ తో దూసుకెళ్తుంది. ఈ క్రమంలో.. డిస్నీ డిజిటల్ వైపు చూస్తోంది. ప్రస్తుతం ఐసీసీ టోర్నీలకు సంబంధించిన టీవీ రైట్స్‌‌‌‌‌‌‌‌ మొత్తం డిస్నీ హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌ చేతుల్లో ఉంది.