ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కలుషితమైన గాలిని పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస ఆడకపోవడం, ఆస్తమా వంటి ఇతర వ్యాధుల భారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ NCRతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శీతాకాలంలో ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో గాలి నాణ్యత తరచుగా ప్రభావితమవుతుంది. అయితే ఏదైనా ట్రిప్ కు ప్లాన్ చేసుకున్నప్పుడు ఎయిర్ క్వాలిటీని చెక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గూగుల్ మ్యాప్స్ లో ఎయిర్ క్వాలిటీని ఈజీగా చెక్ చేయొచ్చు. Google Maps లోని ఈ ఫీచర్‌తో యూజర్లు కాలుష్య స్థాయిల రియల్ టైమ్ స్టేటస్ ను చూడవచ్చు.
Also Read:Rajamouli : తెలుగు మీడియాను లైట్ తీసుకోవడానికి అసలు రీజన్ ఇదా
AQI సమాచారాన్ని Google Maps యాప్, డెస్క్‌టాప్ వెర్షన్‌లలో చెక్ చేయవచ్చు. ఈ ఫీచర్ కలర్-కోడెడ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీనిలో గాలి నాణ్యతను వివిధ షేడ్స్‌లో తనిఖీ చేయవచ్చు. ఆకుపచ్చ రంగు ఆరోగ్యకరమైన గాలి నాణ్యతను సూచిస్తుంది. ముదురు ఎరుపు రంగు కలుషితమైన గాలిని సూచిస్తుంది. ఇది వినియోగదారులు తమ ఇల్లు, పరిసరాలు లేదా బయట గాలి నాణ్యతను తనిఖీ చేయడానికి ఉపయోగపడుతుంది.
AQI ని ఎలా తనిఖీ చేయాలి?
Step 1: ముందుగా, మీ ఫోన్‌లో Google Maps యాప్‌ను అప్‌డేట్ చేయండి. AQI ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి, యాప్‌ను ఓపెన్ చేయాలి. మీకు కుడి వైపున లేయర్‌ల చిహ్నం కనిపిస్తుంది. దానిపై నొక్కండి.
Step 1: ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఆప్షన్ ను ఎంచుకోండి. మ్యాప్‌లో కలర్ కోడ్ కనిపిస్తుంది. మీ లొకేషన్ ఎరుపు రంగులో ఉంటే, గాలి నాణ్యత చాలా పేలవంగా ఉంది అని అర్థం. ఆకుపచ్చ రంగు మెరుగైన గాలి నాణ్యతను సూచిస్తుంది. ఆ ప్రదేశంలో గాలి నాణ్యతను చూడడానికి ఏదైనా పాయింట్‌ను నొక్కండి. మీరు లేయర్స్ గుర్తును నొక్కడం ద్వారా వెబ్‌సైట్‌లో AQI డేటాను కూడా తనిఖీ చేయవచ్చు.