NTV Telugu Site icon

Election Campaign: యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించిన స్థానాలు విజయం..

Yogi

Yogi

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం నిర్వహించారు. అయితే.. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గ స్థానాలన్నీ విజయం నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. సీఎం యోగి ప్రజాదరణ దేశవ్యాప్తంగా ఉన్నట్లు అర్ధమవుతుంది. కాగా.. ఎన్నికల ప్రచారానికి బీజేపీ అధిష్టానం యోగి ఆదిత్యానాథ్‌ను దేశం నలుమూలలకు పంపుతోంది. ఈ క్రమంలో.. జమ్మూలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో సీఎం యోగి సమావేశాలు నిర్వహించారు. ఆ నాలుగు స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. యోగి ఆదిత్యనాథ్ హర్యానాలో 14 సభలు నిర్వహించగా అందులో 9 స్థానాలపై బీజేపీ విజయపతాకం ఎగురవేసింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 9 స్థానాల్లో గెలుపొందడం చాలా ముఖ్యం. మిగిలిన ఐదు స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. హర్యానాలో నాలుగు రోజులు, జమ్మూలో రెండు రోజులు యోగి సమావేశాలు నిర్వహించారు.

Tamilnadu: ఘోర ప్రమాదం.. బాణాసంచా పేలి ముగ్గురు మృతి

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించిన స్థానాలు:
సెప్టెంబరు 22న నర్వానా, రాయ్, అసంధ్ లో ప్రచారం నిర్వహించారు. సెప్టెంబరు 28న ఫరీదాబాద్, రాదౌర్, జగద్రి, అటెలిలో ప్రచారం చేశారు. 30 సెప్టెంబరు బవానీ ఖేడా, హన్సి, నార్నౌండ్, పంచకులలో ప్రచారం నిర్వహించారు. అక్టోబర్ 3 షహాబాద్, కలయత్, సఫిడాన్ లో ప్రచారం నిర్వహించారు.

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రచార స్థానాలు ఇవే:
సెప్టెంబరు 26 రామ్‌గఢ్, ఆర్ఎస్ పురా సౌత్ లో ప్రచారం చేశారు. సెప్టెంబరు 27 రాంనగర్, కథువాలో ప్రచారం నిర్వహించారు.

Show comments