New York: న్యూయార్క్ లో యోగా దినోత్సవం..హాజరైన పది వేల మంది జనం
- ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న వేడుకలు
- సొల్స్టిస్ ఎట్ టైమ్స్ స్క్వేర్ జరిగిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన జనం
- ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించిన న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 27 సెప్టెంబర్ 2014న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు 177 దేశాల మద్దతు లభించింది. యోగా శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను తెలిపేందుకు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈరోజు ప్రధాని మోదీ శ్రీనగర్‌లో యోగా చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు గురువారం రోజు న్యూయార్క్ నగరంలోని ‘సొల్స్టిస్ ఎట్ టైమ్స్ స్క్వేర్’లో యోగా దినోత్సవం నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరిని అభినందించారు. యోగా వల్ల కలిగే శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు, మానసిక ప్రశాంతత గురించి వారికి వివరించారు.
READ MORE: CM Revanth Reddy: కాంగ్రెస్ లోకి రండి.. పోచారంను ఆహ్వానించిన సీఎం రేవంత్
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్ మాట్లాడుతూ.. “ఈ రోజు మనం టైమ్స్ స్క్వేర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుము. యోగాలో పాల్గొనేందుకు అనేక దేశాల నుంచి ఔత్సాహకులు వస్తారు. రోజంతా యోగా కొనసాగుతోంది. ఈ రోజు యోగా చేసేందుకు 8,000 నుంచి 10,000 మంది హాజరయ్యారు. ఈ సంవత్సరం యోగా దినోత్సవం థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ కావడం సంతోషంగా ఉంది. ఇక్కడ మరియు యునైటెడ్ స్టేట్స్‌లోని ఇతర వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో యోగా చేసేందుకు జనాలు ఉత్సాహం కనబరుస్తారు.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!