YS Viveka Case: సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కొంతకాలంగా బెయిల్‌పై బయట ఉన్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు. బెయిల్ రద్దు చేసిన హైకోర్టు.. సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి లొంగిపోయారు. లొంగిపోయిన గంగిరెడ్డి న్యాయస్థానం జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. వైఎస్ వివేకా హత్య కేసు అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం 2019 మార్చి 28న గంగిరెడ్డిని అరెస్టు చేసింది. ఆ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే నిర్దిష్ట వ్యవధిలో ఛార్జిషీట్ దాఖలు చేయడంలో సిట్ విఫలమైనందున..గంగిరెడ్డికి పులివెందులలోని స్థానిక కోర్టు 2019 జూన్ 27న డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. సీబీఐ విచారణ చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసి.. ఈ కేసులో ఏర్ర గంగిరెడ్డిని ఏ-1 గా పేర్కొంది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది. అయితే సీబీఐ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.
Read Also: Bajrangdal protest: తెలంగాణకు తాకిన కర్ణాటక సెగ.. గాంధీ భవన్ వద్ద టెన్షన్
Also Read
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
- YS Jagan: అందుకే "మావిగన్" ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
- Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది నవంబర్‌లో ఈ హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీంతో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం సీబీఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎర్ర గంగిరెడ్డి సాక్షులకు బెదిరింపులు, విచారణకు ఆటంకం కలిగిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. మరోవైపు గంగిరెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి సీబీఐ వద్ద సాక్ష్యాధారాలు లేవని ఆయన తరఫు లాయర్ పేర్కొన్నారు. అయితే ఇరువైపుల వాదనల అనంతరం.. సీబీఐ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది. మే 5వ తేదీలోగా ఎర్రగంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోవాలని.. అలా కానీ పక్షంలో ఆయనను సీబీఐ అరెస్టు చేసేందుకు అనుమతించింది. ఈ క్రమంలోనే నేడు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వచ్చిన ఎర్ర గంగిరెడ్డి న్యాయవాదుల సమక్షంలో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు.
తాజావార్తలు
-
Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
-
Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
-
YS Jagan: అందుకే “మావిగన్” ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
-
Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు
-
Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!