ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల 2023 ఫలితాలు ఈరోజు మార్చి 16న వెల్లడికానున్నాయి. పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు గ్రాడ్యుయేట్ సీట్లు, రెండు టీచర్లు, నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక స్థానానికి సోమవారం పోలింగ్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు మరియు కడప-అనంతపురం-కర్నూలు కాగా.. ఉపాధ్యాయ నియోజకవర్గాలు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు మరియు కడప-అనంతపురం-కర్నూలు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, కర్నూలు (స్థానిక అధికారుల నియోజకవర్గాలు)లో కూడా పోలింగ్ జరిగింది.
Also Read : Canada: కెనడా నుంచి 700 మంది భారతీయ విద్యార్థుల బహిష్కరణ
అయితే.. నేడు ఉదయం 8 గంటల నుంచి ఎమ్మె్ల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే.. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు. అలాగే.. పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ గెలుపొందారు. కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. అంతేకాకుండా.. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌రావు విజయం సాధించారు.
Also Read : Shaktikanta Das: ఆర్బీఐ గవర్నర్ కు అరుదైన గౌరవం
