Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ycp Strategy For 2024 Rajya Sabha Election

YSRCP: రాజ్యసభ కోసం వైసీపీ వ్యూహాత్మక అడుగులు.. ఆ ఆరుగురిపై కూడా వేటు..!

Published Date :January 23, 2024 , 7:46 pm
By Sudhakar Ravula
YSRCP: రాజ్యసభ కోసం వైసీపీ వ్యూహాత్మక అడుగులు.. ఆ ఆరుగురిపై కూడా వేటు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

YSRCP: రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. వచ్చే నెలలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.. గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లు అనూహ్యంగా చేదు అనుభవం ఎదుర్కొంది వైసీపీ.. అయితే, ఈసారి ముందుగా అలర్ట్‌ అయ్యింది అధికార పార్టీ.. తమ పార్టీ రెబల్స్ పై అనర్హతకు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసిన విషయం విదితమే.. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి.. మరోవైపు.. ఇద్దరు ఎమ్మెల్సీలు సి. రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్ పై కూడా ఫిర్యాదులు వెళ్లాయి.. అయితే, ఒకే సారి నలుగురు రెబల్ ఎమ్మెల్యేలతో పాటు.. ఇద్దరు ఎమ్మెల్సీలపై కూడా వేటు పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

Read Also: Prashanth Varma: హాలీవుడ్ వాళ్ళు ఇండియా నుండి ఏ సినిమా వస్తుందని డిస్కషన్ పెట్టే రేంజ్ కి తీసుకువెళ్తా!

అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామాకు ఆమోద ముద్ర వేయడంతో ఇప్పుడు ఈ వ్యవహారం చర్చగా మారింది.. మరోవైపు.. నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పులతో టికెట్ గల్లంతు అయిన సిట్టింగుల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.. ఇప్పటి వరకు 29 మంది సిట్టింగ్ లకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొండిచేయి ఇచ్చింది.. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు. సీటు దక్కని మరికొందరు సిట్టింగ్‌ల్లో కొందరు టీడీపీ, మరికొందరు జనసేన పార్టీలతో టచ్‌లోకి వెళ్లారు.. దీంతో, రాజ్యసభ ఎన్నికల్లో విజయమే టార్గెట్‌గా వైసీపీ పావులు కదుపుతోంది. మరోవైపు.. ఇప్పటికే స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖ అందజేశారు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే).. ఆ రాజీనామాపై స్పీకర్ తమ్మినేని త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • CM YS Jagan
  • Rajya Sabha Election
  • tdp

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions