టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఛాలెంజ్ విసిరారు. ఆర్యవైశ్యులకు తాను ఏం అన్యాయం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని, టీడీపీ ఆపీస్‌కు రమ్మన్నా కూడా తాను సిద్ధమే అంటూ వెలంపల్లి సవాల్ చేశారు. ఆర్యవైశ్య సంఘాల ముసుగులో తనను ఇబ్బందిపెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య వైభవం కార్యక్రమం జరగకుండా మాజీమంత్రి వెల్లంపల్లి అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సవాల్ విసిరారు.
విజయవాడలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ‘ఆర్యవైశ్య సంఘాల పేరిట నన్ను ఇబ్బంది పెడుతున్నారు. హిందూ ద్రోహులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఏనాడూ ఆర్యవైశ్యులకు ఏమీ చేయలేదు. గోవుల దగ్గర గడ్డి మేసే వాళ్లు టీడీపీ నేతలు. రాజకీయ ముసుగులో ఉండే వారే టీడీపీ దగ్గర వైశ్యులు. సామూహిక సత్యనారాయణ వ్రతాలకు పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వలేదు. కార్తీక పౌర్ణమి స్నానాల కోసం వేలాది మంది భక్తులు వచ్చేచోట వారికి ఇబ్బంది కలిగేలా కార్యక్రమం తలపెట్టారు. బొండా ఉమా స్ధలం అయితే చంద్రబాబు రోడ్లు ఎలా వేశారు. చంద్రబాబు అక్కడి వారిని ఖాళీ చేయించాడు. అక్కడ స్ధలానికి బొండా ఉమా ఎప్పుడైనా శిస్తు కట్టాడా?’ అని ప్రశ్నించారు.
‘దొంగ స్ధలం విషయంలో పవన్, చంద్రబాబు తొత్తులు ఆర్యవైశ్య ముసుగులో మాట్లాడుతున్నారు. వీలైనంత వరకూ అందరికీ మంచి చేయాలనే చూస్తాను. కొణిజేటి రోశయ్య ఆర్ధిక మంత్రిగా ఉండగా.. వాసవీ ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి. సీఎం జగన్ నన్ను మంత్రిని చేసారు, ఆర్యవైశ్యులకు పదవులిచ్చారు. ఆర్యవైశ్య సత్రాల నిర్వహణ ఆర్యవైశ్యులకు ఇచ్చారు జగన్. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఏడ్చిన వాడు చంద్రబాబు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం చేస్తున్న వ్యక్తి జగన్. చింతామణి నాటకం విషయంలో జీఓ రద్దు చేసింది సీఎం జగన్. రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ రద్దు చేయించలేదు చంద్రబాబు’ అని వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు.
Also Read: Kakinada: కాకినాడలో యువ వైద్యుడి ఆత్మహత్య.. వైసీపీ నాయకుల బెదిరింపులే కారణమా?
‘ఎంతమంది కలిసొచ్చినా నా చిటికిన వేలు వెంట్రుక కూడా పీలేకరు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆర్యవైశ్యులకు ఇచ్చే సత్తా టీడీపీలో ఎవరికైనా ఉందా?. వీఎంసీకి మీరు ఎందుకు అప్లికేషన్ పెట్టలేదు. పవన్, చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గంలో ఆటలాడుతున్నారు. మీరు బ్లాక్ మెయిల్ చేసి, పార్టీని అడ్డుపెట్టుకుని బ్రతుకుతారు. ఎలక్ట్రిక్ బైకులకు డబ్బులు కట్టకుండా ఉంటే గుంతకల్లులో డుండీ రాకేష్ భార్యపై కేసు ఉంది. పోతిన మహేష్ కు సిగ్గుందా.. తెరచాటు, దొంగచాటు పనులు మానండి’ అని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు.