Site icon NTV Telugu

Mudragada Padmanabham: ముద్రగడ కుమారుడితో రాజకీయ అంశాలపై వైసీపీ నేతల చర్చ!

Mudragada Padmanabham

Mudragada Padmanabham

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం కుటుంబం రాజకీయ భవితవ్యంపై తర్జన భర్జన జరుగుతోంది. ముద్రగడ కుమారుడు గిరికి వైసీపీ పెద్దలు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన ప్రపోజల్‌పై ముద్రగడ కుమారుడు గిరి తన తండ్రితో చర్చించారని తెలిసింది. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా తనను సంప్రదిస్తారని, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని కొడుకు గిరికి పద్మనాభం సూచించినట్లు తెలుస్తోంది. పొలిటికల్‌గా తండ్రిని కాదని తాను చేసేది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు గిరి. గతంలో కూడా ఇలాగే నాన్చుడు వ్యవహారం జరిపారని అంటున్నారు పద్మనాభం అనుచరులు. ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు.

Read Also: Vasantha Krishna Prasad: నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరాను..

గతంలో ఇంటికి వస్తామని కబురుపంపించిన వాళ్ళు తర్వాత ఆచూకీ లేదని ఇప్పుడు ఆకాశ రామన్న ఫోన్ రాయబారాలు ఎందుకని అంటున్నారు పద్మనాభం. పరోక్షంగా పవన్ వ్యవహారాన్ని ప్రస్తావించారు ముద్రగడ పద్మనాభం. గతంలోను వైసీపీ నుంచి 10 నెలలు పాటు ఇలాగే నాన్చుడు వ్యవహారం జరిగిందని చెప్తున్నారు అనుచరులు. ఆచి తూచి స్పందిస్తున్న వైసీపీ, ఈక్వేషన్స్ ఆధారంగా స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

 

Exit mobile version