Amzath Basha: నిధులు లేవంటూ.. నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు!
- ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది
- నిధులు లేవంటూ నిందలు వేస్తున్నారు
- వైసీపీ తరపున పోరాడుతాం
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా అన్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. నిధులు లేవంటూ మాజీ సీఎం వైస్ జగన్ గారిపై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆంజాద్ బాషా ఫైర్ అయ్యారు. తమ వైఫల్యాలను కప్పి పుచుకునేందుకు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా మాట్లాడుతూ… ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లో ప్రజలకిచ్చిన హామీలు తుంగలో తొక్కారు. కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ అనేక హామీలు ఇచ్చారు.. కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నిధులు లేవంటూ వైఎస్ జగన్ గారిపై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా 2023లో జీవో 47 కింద వక్ఫ్ బోర్డు నియామకం చేశాం. దాన్ని నిన్న ఆ జీవోను ఉపసంహరించుకోవడం దుర్మార్గం. పూర్తి నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు నియామకం జరిపాం. బోర్డు సభ్యులు చైర్మన్ ఎన్నిక చేసుకుంటే ఆనాడు టీడీపీ వారు కోర్టులో కేసు వేసి నిలుపుదల చేసారు. చైర్మన్ ఎన్నిక కాకుండా ఆనాడు 4 పిటిషన్లు వేశారు. ఈ అంశం ఇంకా కోర్టులోనే ఉంది. మారి కమిటీనెలా రద్దు చేస్తారు?. కమిటీకి 5 ఏళ్ల కాలం, పదవీ కాలం ఉంటే ఎలా రద్దు చేస్తారు?. కేవలం టీడీపీ వారిని నియమించుకుని వక్ఫ్ ఆస్తులకు దురాక్రమణ చేయాలనే ఆ జీవో రద్దు చేశారు. బోర్డు చాలా కాలంగా పని చేయడం లేదంటూ రద్దు చేశామని చెప్తున్నారు. కోర్టులో కేసులు వేసి పని చేయకుండా చేసింది మీ టీడీపీ వారు కాదా?’ అని ప్రశ్నించారు.
‘నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో రిట్లను ఉపసంహరించుకోవాలి కానీ బోర్డు రద్దు చేయడం ఏమిటి?. 2014-19 మధ్యలో చంద్రబాబు అసలు వక్ఫ్ బోర్డు వేయనే లేదు. 2018లో చంద్రబాబు కమిటీ వేస్తే దాని కాలం 2023 వరకూ ఉంది. మేము అధికారంలోకి వచ్చాక చంద్రబాబులా ఆ బోర్డును మేము రద్దు చేయలేదు. ఆ రోజు జలీల్ ఖాన్, అమీర్ బాబు వంటి వారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఆ బోర్డు కాలపరిమితి ముగిసిన తర్వాత మాత్రమే మేం కొత్త బోర్డు వేశాం. కానీ మీరు మేము వేసిన బోర్డు కాలపరిమితి ముగియకముందే రద్దు చేయడం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చింది. దాన్ని ముస్లింలు అంతా వ్యతిరేకిస్తున్నారు. జగన్ గారి ఆదేశాలతో పార్లమెంటులో వైసీపీ వ్యతిరేకించింది. వక్ఫ్ ఆస్తులకు అన్యాక్రాంతం చేసేందుకే ఈ చట్టం తెస్తున్నారు. దీనివల్ల ముస్లింల హక్కులు దెబ్బతింటున్నాయి. అందుకే వైసీపీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉంది. జమాతే ముస్లిం నేతలు కూడా జగన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. జీవో 47 రద్దుపై మేము కచ్చితంగా చట్టప్రకారం పోరాడతాం. ఈ 6 నెలల్లో మైనారిటీలకు ఏమీ చేయకుండా.. మీ వారిని సభ్యులుగా పెట్టుకోవాలని ఇలా ఉపసంహరణ చేస్తున్నారు. మైనారిటీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైసీపీ తరపున పోరాడుతాం’ అని ఆంజాద్ బాషా పేర్కొన్నారు.
- Tags
- Amzath Basha
- ap
- tdp
- ycp
- ys jagan
తాజావార్తలు
-
Viral : పంది కడుపున ‘ఏనుగు పిల్ల’.. విస్తుపోతున్న జనం.!
-
Editor Madhu Reddy: చిన్న వయసులోనే దూరమైన ప్రతిభావంతుడు.. గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
-
Gold In India: ఇండియాలో బంగారమే బంగారం.. బయటపడ్డ 42.5 టన్నుల గోల్డ్.. తవ్వకాలకు అంతా సిద్ధం..
-
House Construction: మీరు ఇంటిని ఏ డబ్బుతో కడుతున్నారు..? స్వాధీనం తప్పుదు..!
-
Rammohan Naidu : మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ చేసిన క్షమించరాని పాపం
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?