Site icon NTV Telugu

YCP vs TDP: హైదరాబాద్‌లో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్..! టీడీపీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

Election Commission

Election Commission

YCP vs TDP: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాను కలిసిన వైసీపీ నేతలు.. హైదరాబాద్ లో టీడీపీ ఆధ్వర్యంలో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.. సీఈవో ను కలిసినవారిలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఉన్నారు.. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు.. హైదరాబాద్ లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.. హైదరాబాద్ లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రగతి నగర్ లో బ్యానర్లు కట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు.. సిగ్గు లేకుండా పక్క రాష్ట్రంలో బ్యానర్లు కట్టి ఓట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

Read Also: Utter Pradesh: యూపీలో ఘోరం.. బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం

టీడీపీ నాయకులు నపుంసకుల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నాగార్జున.. మాజీ మంత్రి ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్‌ ఇచ్చారు. తెలంగాణ లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు మంత్రి మేరుగ నాగార్జున. ఇక, ఎన్నికల్లో లబ్ది పొందేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని దుయ్యబట్టారు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు.. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం టీడీపీ చేస్తోందని ఆరోపించారు. మరోవైపు.. స్థిర నివాసం ఉన్నచోటే ఓటు హక్కు కల్పించాలని సీఈవోను కోరాం అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. తెలంగాణ ఓట్లను ఏపీలో మార్చడానికి సిగ్గులేదా? అని నిలదీశారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా వాలంటీర్లను ఉపయోగించడం లేదన్నారు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ టీడీపీ కండువా వేసుకుని మాట్లాడితే బాగుంటుందంటూ మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.

Exit mobile version