NTV Telugu Site icon

YCP: లోకేశ్ ‘కుర్చి మడత పెట్టి’ వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్ ఎటాక్..

Gudiwada

Gudiwada

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న విజయనగరం నెల్లిమర్ల శంఖారావం సభలో మాట్లాడుతూ.. ‘నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే.. మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం’ అని అన్నారు. వేదికపై లోకేశ్ స్వయంగా కుర్చీని మడతపెట్టి చూపించాడు. ఈ క్రమంలో వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. జగన్ దెబ్బకు లోకేష్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో మడత పడిపోయాయని విమర్శించారు. నీ కుర్చీని 2019లో మేం మడత బెడితే.. ఇప్పుడు నీ కుర్చీని నువ్వే మడత బెట్టుకుంటామని నువ్వే సంకేతాలు ఇచ్చావని తెలిపారు. లోకేష్ నాలుక మడత తీస్తే కనీసం పదాలైన సరిగ్గా పలుకుతాడు.. లోకేష్ ను మరోసారి మడత పెట్టేస్తామని వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఎర్రపుస్తకంతో పెద్ద పని, అవసరం ఉండదు దానిని ఎక్కడ మడత పెట్టి పెట్టుకుంటావో నీ ఇష్టం అని దుయ్యబట్టారు. నువ్వు ఎంత సీరియస్ నెస్ క్రియేట్ చేసినా.. నీ కామెడీ ఫేస్ అందుకు సూట్ అవ్వదని లోకేశ్ పై తీవ్ర విమర్శలు చేశారు.

Sriharikota: GSLV-F14 రాకెట్‌ ప్రయోగం విజయవంతం..

మరోవైపు వైసీపీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అసలు కుర్చీనే లేనప్పుడు టీడీపీ నేతలు ఎలా మడతేస్తారని విమర్శించారు. మాకు షర్ట్స్ ఉన్నాయ్ కాబట్టి మడత వేసే అవకాశం ఉంటుందన్నారు. “విధ్వంసం” పుస్తకం రాసిన వాళ్ళు, ఆవిష్కరించిన వాళ్ళను చూస్తేనే దాని వెనుక విద్వేషం అర్ధం అవుతోందని వైవీ సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. మరోవైపు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీకి రాజ్య సభలో ఒక్క సీట్ కూడా లేకుండా పోయిందని అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా ఇదే పరిస్థితి రావొచ్చని తెలిపారు.

Delhi: 2024 ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన