Yatra 2: ‘యాత్ర 2’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yatra 2 Movie to Release on 2024 Feb 8th: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర 2’. ఈ సినిమాకు మహీవీ రాఘవ్ దర్శకుడు. 2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. వైఎస్సార్ పాత్రలో మలయాళ ‘సూపర్ స్టార్’ మమ్ముట్టి జీవించారు. ఇక యాత్ర 2లో కోలీవుడ్ స్టార్ జీవా.. వైఎస్ జగన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా యాత్ర 2 నుంచి మేకర్స్ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.
యాత్ర 2 ఫస్ట్ లుక్‌ను ఈరోజు ఉదయం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో ఒకవైపు జీవా ఉండగా.. మరోవైపు మమ్ముట్టి ఉన్నాడు. మమ్ముట్టి, జీవా ఇన్‌టెన్స్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌లో ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అంటూ పోస్టర్‌లో రాసుకోచ్చారు. ఫస్ట్ లుక్‌తో పాటు మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. యాత్ర 2 సినిమా 2024 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించారు. అత్యంత ప్రజాదరణను పొందిన ఈ చిత్రంకు కొనసాగింపుగా వైఎస్‌ఆర్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ‘యాత్ర 2’ని తెరకెక్కిస్తున్నారు. ‘యాత్ర’ చిత్రాన్ని 2019 ఫిబ్రవరి 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుండడం విశేషం.
Also Read: Bhagavanth Kesari Trailer: దసరా దావత్ షురూ.. ఓరుగల్లు గడ్డపై బాలయ్యబాబుకు తలకాయ కూర!
యాత్ర ఫస్ట్ పార్టులో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా.. సెకండ్ పార్టులో మమ్ముట్టి సహా జీవా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతోన్న యాత్ర 2 చిత్రానికి మది కెమెరామెన్ కాగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. యాత్రలో జగపతి బాబు, రావు రమేష్, అనసూయలు కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.
Presenting the first look of #Yatra2. In cinemas worldwide from 8th Feb, 2024.#Yatra2FL #Yatra2OnFeb8th #LegacyLivesOn @JiivaOfficial @ShivaMeka @MahiVraghav pic.twitter.com/4m4PhJsurF
— Mammootty (@mammukka) October 9, 2023
తాజావార్తలు
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!